armoor constituency
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డి పేరు జీవన్ రెడ్డి ఈలోన్ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. దీంతో, అసలు ప్లస్ వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. కాగా, నోటీసుల అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బకాయిల వసూలుకు నోటీసులు.. ఇదిలా ఉండగా, అంతకుముందు.. జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట ఐదు అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
ఎంపీ అరవింద్‌తో విభేదాలు.. బీజేపీకి గుడ్‌బై
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్మూరు నియోజక వర్గ బీజేపీ ఇంఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ఎంపీ అరవింద్‌తో వినయ్‌కి పడటం లేదు. చివరకు.. ఎంపీ అరవింద్ వ్యతరేకంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇటీవల ఆందోళన సైతం చేపట్టారు వినయ్. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆయన పార్టీ మారుతుండడం చర్చకు దారి తీసింది. వినయ్ 2018 లో ఆర్మూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు వినయ్. ఆ ఎన్నికల్లో దాదాపు 20 వేల ఓట్లు సాధించారు. ఈ దఫా ఆర్మూర్ టికెట్ ఆశావాహుల్లో ఈయన కూడా ఉన్నారు. బీజేపీని వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినయ్ బయటకు రావడం.. జిల్లాలో కమలం పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం -
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అటాక్.. ఆ కారణం వల్లే పిస్టల్ తలకు గురిపెట్టి..
సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌ను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ సోమవారం ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. బిల్లులు ఆగాయని హత్యకు పథకం.. కొన్నాళ్లుగా జీవన్‌రెడ్డి, ప్రసాద్‌గౌడ్‌కు స్పర్థలున్నా యి. తన భార్య కల్లెడ సర్పంచ్‌గా ఉండగా ప్రసాద్ ఆ గ్రామంలో రూ.20 లక్షల విలువైన కాంట్రాక్టులు చేశాడు. ఈ పనుల్లో అవకతవ కలు జరిగినట్లు మాక్లూర్ ఎంపీఓ నివేదిక రూపొందించారు. దీంతో కలెక్టర్ కల్లెడ సర్పంచ్‌ను సస్పెండ్ చేశారు. ప్రసాద్‌కు రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. విచక్షణ కోల్పోయిన ప్రసాద్ ఎంపీఓపై దాడి చేయడంతో మాక్లూర్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. తనతో ఉన్న విభేదాలతో జీవన్‌రెడ్డే ఇవన్నీ చేయిస్తున్నాడని భావించిన ప్రసాద్.. హత్యకు పథకం వేశాడు. గత ఏప్రిల్‌లో నాందేడ్‌లో కత్తి, జూన్‌లో సంతోష్ సహకారంతో నగరంలోని నాంపల్లిలో ఎయిర్‌పిస్టల్, పిల్లెట్స్ కొన్నాడు. నేరుగా జీవన్‌రెడ్డి ఇంటికెళ్లినా ఆయన లేకపోవడంతో కొద్దిసేపు రెక్కీచేసి ఊరికి వెళ్లిపోయాడు. తలకు ఎయిర్‌పిస్టల్ గురిపెట్టి.. జూలై మొదటి వారంలో నిజామాబాద్‌కు చెందిన సుగుణ ద్వారా బాల్కొండకు చెందిన సురేందర్ ప్రసాద్‌కు పరిచయమయ్యాడు. రూ.60 వేలు తీసుకున్న సురేందర్.. బిహార్‌లోని మున్నాకుమార్ ద్వారా నాటుపిస్టల్ తెప్పించి, ప్రసాద్‌కిచ్చాడు. తూటాల కోసం దమ్మాయ సాగర్‌తో కలిసి ప్రయత్నించినా దొరకలేదు. దీంతో నాంపల్లిలోని ఆర్మరీకి వెళ్లిన తూటాలు కావాలని అడి గినా వారు ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి ప్రసాద్ బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి ఇంటికెళ్లాడు. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి ఆయన తలకు ఎయిర్‌పిస్టల్ గురిపెట్టాడు. ఎమ్మెల్యే కేకలు వేయడం.. గన్మెన్లు అప్రమత్తం కావడంతో ప్రసాద్ పారిపోయాడు. జీవన్‌రెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసునమోదు చేశారు. ఆదివారం రాత్రి ప్రసాద్‌ను పట్టుకుని.. కారు, ఎయిర్ పిస్టల్స్, పిల్లెట్స్, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సుగుణ, సంతోష్, మున్నాకుమార్, సురేందర్, దమ్మాయ సాగర్ కోసం గాలిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న గన్మెన్లపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని, ప్రసాద్ భార్య పాత్రపై ఆధారాల్లేవని డీసీపీ తెలిపారు. ఇది కూడా చదవండి: ‘నేనే కాంగ్రెస్.. కాంగ్రెస్సే నేను’.. ఆసక్తికరంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు -
ఆర్మూర్ టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు
-
దేశానికే ఆదర్శంగా తెలంగాణ: ఎంపీ కవిత
సాక్షి, పెర్కిట్(ఆర్మూర్): టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 60 సంవత్సారలలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ కేవలం నేతృత్వంలో నాలుగున్నరేళ్లలో చేపట్టారని, దీంతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచ్‌లు తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆర్మూర్ టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా ఆర్మూర్ మండలం పెర్కిట్, మామిడిపల్లి గ్రామాలలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో కవిత ప్రసంగించారు. రాబోయే రోజుల్లో రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆయా సామాజికవర్గాల్లోని పేదలను ఆదుకుంటామన్నారు. అలాగే, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వేయి కోట్లు కేటాయించామని తెలిపారు. ఎలాంటి ఆధారం లేని ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వమే రూ.2 లక్షల రాయితీతో రుణాలను అందజేయనుందని చెప్పారు. మహిళా సంఘాలను సైతం పటిష్టం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్ర పాలకులకు అప్పజెప్పడానికి కాంగ్రెస్, ఏపీ సీఎం చంద్రబాబుతో జత కట్టిందని విమర్శించారు. తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు మళ్లీ మన రాష్ట్రంలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నానడి, ఎన్నికల్లో మహాకూటమికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన టీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు మధుశేఖర్, ఎల్ఎంబీ రాజేశ్వర్, కోటపాటి నర్సింహానాయుడు, రాజారాం యాదవ్, బెన్కి గంగా మోహన్, తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరిన రాజారాం యాదవ్ ఆర్మూర్: కాంగ్రెస్ నాయకుడు రాజారాం యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన రాజారాం యాదవ్.. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరడంతో ఆర్మూర్ అసెంబ్లీ టికెట్ కేటాయించారు. దీంతో బీజేపీ, టీడీపీల పొత్తులో నాటి ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి, ఓటమి పాలయ్యారు. తర్వాతి కాలంలో రేవంత్‌రెడ్డి అనుచరుడిగా కొనసాగుతూ ఆయనతో పాటే కాంగ్రెస్‌లో చేరాడు. కాంగ్రెస్, టీడీపీ జత కట్టిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. టీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపించారు. చివరకు ఎంపీ కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. -
ప్రజలే నా దేవుళ్లు.. ఆశీర్వదించండి: ఆశన్నగారి జీవన్‌రెడ్డి
సాక్షి, నందిపేట్: మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సోమవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో జీవన్‌రెడ్డి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు అడుగడుగునా అపూర్వ స్పందన లభించింది. సోమవారం మార్కెట్ దినం కావడంతో జీవన్‌రెడ్డి మార్కెట్ వచ్చిన జనంతో కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన నాలుగున్నర ఏళ్లలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఈ సారి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. నియోజవర్గానికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చి ఆదర్శంగా నిలిపానని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని గెలిపించాలని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి కోరారు. చర్చిలో ప్రార్థనలు మండల కేంద్రంలోని జూడచర్చిలో జీవన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్, కేఆర్ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు. నక్కల భూమేష్, మీసాల సుదర్శన్, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్, సిలిండర్ లింగం, బాలగంగాధర్, హైమద్‌ఖాన్, కొత్తూర్ రాజేశ్వర్, ఎంపీటీసీ గొల్లపల్లి సురేష్‌గౌడ్, బత్తుల శ్రీనివాస్, నాగలింగం, మజీరోద్దీన్, శాకిర్‌హుస్సేన్, బొడ్డు రాజశేఖర్, సయ్యద్ హుస్సేన్, ఉస్నోద్దీన్, మాన్పూర్ భూమేష్ పాల్గొన్నారు. అంకాపూర్‌లో జీవన్‌రెడ్డికి ఘన స్వాగతం పెర్కిట్: ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి సోమవారం గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి చేరుకున్న జీవన్‌రెడ్డికి గ్రామ మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మార గంగారెడ్డి, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం మాక్లూర్: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి భార్య రజితరెడ్డి అన్నారు. కృష్ణానగర్‌లో సోమవారం ఇంటింటికి వెళ్లి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. నిరంతరం ప్రజల కోసం జీవన్‌రెడ్డి కృషి చేస్తారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. తిరుమల నర్సాగౌడ్, కోక హైమద్, బాబ్జీ పాల్గొన్నారు. పెర్కిట్: ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు సోమవారం ప్రచారం నిర్వహించారు. పెర్కిట్ ఎంపీటీసీ, ఎంఐఎం నాయకుడు జహీర్ అలీ, మండల కోఆప్షన్ సభ్యుడు సాజిద్ అలీ ఆధ్వర్యంలో ఇస్లాంపుర, జెండా గల్లి కాలనీల్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉబేదుల్లా, నిజాముద్దీన్, సల్మాన్, మతిన్, సుమీర్ పాల్గొన్నారు. -
రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం
సాక్షి,మాక్లూర్ (నిజామాబాద్): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ. 2లక్షల రుణా మాఫీ చేస్తామని ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వి నయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మదన్‌పల్లి, సట్లాపూర్‌తాండ, మదన్‌పల్లి క్యాంపు, అమ్రాద్‌తాండ, ఒ డ్యాట్‌పల్లి, ముత్యంపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిదిందేమిలేదన్నారు. బీజేపీతోని దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు గ్రామాల్లో డ్రెయినేజీలు, సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దన్నారు. గత నాలుగునర ఏళ్లలో అ భివృద్ధి ఎక్కడ జరుగలేదన్నారు. ఆరు గ్రామాల్లో ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన మహిళలు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ముప్పడి గంగారెడ్డి, గంగోని సంతోష్, భోజారావు, షబ్బీర్, మురళీ, అనన్యరెడ్డి, తార చంద్, గంగోని రాజు, అంబునాయక్, దేవన్న, తదితరులు పాల్గొన్నారు. -
హలో ఎమ్మెల్యే గారు..
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నేడు సిద్దుల గుట్టపై కార్యక్రమం ప్రారంభం ఆర్మూర్ : నమస్తే నేను మీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని.. మీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీ సమస్య ఏంటో చెప్పండి.. మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.. అంటూ ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించడానికి 24 గంటలు, 365 రోజుల పాటు ఎమ్మెల్యే ఫోన్లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. మ్మెల్యే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసారు. ఈ టెక్నాలజీ ద్వారా 1860425252 నెంబర్లో ఎమ్మెల్యేకు సమాచారం చేరవేయవచ్చును. బాధితులు ఈ సెల్ ఫోన్ లేదా ల్యాండ్ ఫోన్‌తో సూచించిన నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గొంతు వినిపిస్తుంది. బీప్ అనంతరం రెండున్నర నిముషాల పాటు బాధితులు తమ సమస్యను చెప్పుకోవచ్చును. బాధితులు చెప్పే సమస్య రికార్డు అవుతుంది. తర్వాత తిరిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.. నేను గాని మా సిబ్బంది గాని సమస్య పరిష్కారానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాము.. అంటూ కాల్ ముగుస్తుంది. ఈ రికార్డును ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పరిశీలించి సమస్య తీవ్రతను బట్టి వెంటనే స్పందిస్తారు. వైద్య సేవలు, తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలైతే సంబంధిత సిబ్బంది సమస్యకు సంబంధించిన అధికారితో వెంటనే ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. బాధితులు చెప్పిన సమస్యలన్ని నేరుగా ఎమ్మెల్యేకు అందుబాటులో ఉండే లాప్టాప్కు చేరుతాయి. ఎమ్మెల్యే స్వయంగా పరిష్కరించాల్సిన సమస్య ఉంటే తన కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే తగు చర్యలు తీసుకుంటారు. నేడు సిద్దుల గుట్టపై ప్రారంభం.. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఫోన్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండటానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా ఈ మీ సేవలో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.