మాట్లాడుతున్న ఆశన్నగారి జీవన్‌రెడ్డి
సాక్షి, నందిపేట్: మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సోమవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో జీవన్‌రెడ్డి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు అడుగడుగునా అపూర్వ స్పందన లభించింది. సోమవారం మార్కెట్ దినం కావడంతో జీవన్‌రెడ్డి మార్కెట్ వచ్చిన జనంతో కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన నాలుగున్నర ఏళ్లలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.
గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఈ సారి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. నియోజవర్గానికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చి ఆదర్శంగా నిలిపానని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని గెలిపించాలని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి కోరారు.
చర్చిలో ప్రార్థనలు
మండల కేంద్రంలోని జూడచర్చిలో జీవన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్, కేఆర్ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు. నక్కల భూమేష్, మీసాల సుదర్శన్, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్, సిలిండర్ లింగం, బాలగంగాధర్, హైమద్‌ఖాన్, కొత్తూర్ రాజేశ్వర్, ఎంపీటీసీ గొల్లపల్లి సురేష్‌గౌడ్, బత్తుల శ్రీనివాస్, నాగలింగం, మజీరోద్దీన్, శాకిర్‌హుస్సేన్, బొడ్డు రాజశేఖర్, సయ్యద్ హుస్సేన్, ఉస్నోద్దీన్, మాన్పూర్ భూమేష్ పాల్గొన్నారు.
అంకాపూర్‌లో జీవన్‌రెడ్డికి ఘన స్వాగతం
పెర్కిట్: ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి సోమవారం గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి చేరుకున్న జీవన్‌రెడ్డికి గ్రామ మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మార గంగారెడ్డి, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
మాక్లూర్: టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి భార్య రజితరెడ్డి అన్నారు. కృష్ణానగర్‌లో సోమవారం ఇంటింటికి వెళ్లి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. నిరంతరం ప్రజల కోసం జీవన్‌రెడ్డి కృషి చేస్తారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. తిరుమల నర్సాగౌడ్, కోక హైమద్, బాబ్జీ పాల్గొన్నారు.
పెర్కిట్: ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో టీఆర్‌ఎస్, ఎంఐఎం నాయకులు సోమవారం ప్రచారం నిర్వహించారు. పెర్కిట్ ఎంపీటీసీ, ఎంఐఎం నాయకుడు జహీర్ అలీ, మండల కోఆప్షన్ సభ్యుడు సాజిద్ అలీ ఆధ్వర్యంలో ఇస్లాంపుర, జెండా గల్లి కాలనీల్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉబేదుల్లా, నిజాముద్దీన్, సల్మాన్, మతిన్, సుమీర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment