రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం  | We Pay Two Lakhs Of Loan Money | Sakshi
Sakshi News home page

రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం 

Published Wed, Nov 14 2018 6:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

 We Pay Two  Lakhs Of  Loan Money   - Sakshi

మదన్‌పల్లిలో మాట్లాడుతున్న వినయ్‌రెడ్డి

సాక్షి,మాక్లూర్‌ (నిజామాబాద్‌): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ. 2లక్షల రుణా మాఫీ చేస్తామని ఆర్మూర్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వి నయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మదన్‌పల్లి, సట్లాపూర్‌తాండ, మదన్‌పల్లి క్యాంపు, అమ్రాద్‌తాండ, ఒ డ్యాట్‌పల్లి, ముత్యంపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరిదిందేమిలేదన్నారు. బీజేపీతోని దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు  గ్రామాల్లో డ్రెయినేజీలు, సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు.  

టీఆర్‌ఎస్‌ పార్టీని నమ్మవద్దన్నారు. గత నాలుగునర ఏళ్లలో అ భివృద్ధి ఎక్కడ జరుగలేదన్నారు. ఆరు గ్రామాల్లో ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన మహిళలు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ముప్పడి గంగారెడ్డి, గంగోని సంతోష్, భోజారావు, షబ్బీర్, మురళీ, అనన్యరెడ్డి, తార చంద్, గంగోని రాజు, అంబునాయక్, దేవన్న, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement