కృష్ణా: ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు అవేదన వ్యక్తం చేశారు. సోమవారం మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు.
ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలచివేసిందని తెలిపారు. తమ దగ్గర్నుంచి మొబైల్ సిమ్స్, డివైస్‌లు తీసేసుకున్నారని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని, తాము ఎవరిదగ్గర డేటా సేకరించామో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమను ఎన్నో రకాలుగా అవమానించినా భరించామని అన్నారు. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఉదయం నుంచి తమకు వృద్ధులు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment