కాంగ్రెస్‌ను తిట్టిపోసి బయటకొచ్చిన నాయకుడికి బీజేపీ కీలక బాధ్యతలు | Three Former Congress Laders BJP Announced New Roles | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడిన ముగ్గురు నాయకులకు...బీజేపీ కీలక భాద్యతలు

Published Fri, Dec 2 2022 5:53 PM | Last Updated on Fri, Dec 2 2022 5:53 PM

Three Former Congress Laders BJP Announced New Roles - Sakshi

గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ అయిన కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చేసి భారతీయ జనతా పార్టీలోకి చేరిన కాంగ్రెస్‌ నాయకులకు కీలక భాద్యతలు కట్టబెట్టింది బీజేపీ. ఈ మేరకు పార్టీ నిర్ణయాధికారాలు యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా  లేదంటూ ఘోరంగా కాంగ్రెస్‌ని ఘోరంగా తిట్టి రాజీనామా చేసి వచ్చిన జైవీర్‌ షెర్గిల్‌ను బీజేపీ అధికార ప్రతినిధిగా నియమించింది. అలాగే పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖర్‌లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం బీజేపీలో యూపీ మంత్రి స్వతంత్రదేవ్‌ సింగ్‌, ఉత్తరాఖండ్‌ బీజేపీ మాజీ మదన్‌ కౌశిక్‌, కాంగ్రెస్‌ మాజీ నాయకుడు రాణా గుర్మిత్‌సింగ్‌ సోధీ, పంజాబ్‌ మాజీ మంత్రి మనోరంజన్‌ కాలియా తదితరులు ఉన్నారు.

ఇదిలా ఉండగా, గతేడాది పంజాబ్‌లో అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఎన్నికల ముందుకు కొత్తపార్టీని స్థాపించి బీజేపీలో విలీనం చేశారు. గత కొన్నేళ్లుగా ఎన్నికల పరాజయాలు, సంస్థాగత ప్రకంపనలతో పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ అనేక మంది సీనియర్‌ నాయకులను కోల్పోయింది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, యూపీ మంత్రి జితన్‌ ప్రసాద్‌ నిష్క్రమణతో 2020నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కేంద్ర మాజీ మంత్రులు కపిల్ సిబల్, అశ్వనీ కుమార్, ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అలాగే అనుభవజ్ఞులైన గులాం నబీ అజాద్‌, ఆనంద్‌ శర్మలు తమ సొంత రాష్ట్రాల్లో పార్టీ పదువులకు ఆగస్టులో రాజీనామా చేశారు. 

(చదవండి: యూపీలో మహారాష్ట్ర తరహా పాలిటిక్స్‌.. అఖిలేష్‌ వ్యాఖ్యలతో పొలిటికల్‌ హీట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement