ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)లో ఉద్యోగులు సంఖ్య తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈఏడాది 42,052 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆర్‌ఐఎల్ వార్షిక నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం శ్రామికశక్తి 3,47,362గా ఉంది. ఇది అంతకుముందు ఏడాదిలో 3,89,414గా ఉండేది. అయితే రాజీనామా చేసిన 42,052 మంది ఉద్యోగుల్లో 38,029 మంది రిలయన్స్ రిటైల్ నుంచే ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
కంపెనీ నివేదికలోని వివరాల ప్రకారం..రిటైల్ రంగంలోని వ్యాపారానికి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత తీవ్ర అంతరాయంగా మారుతోంది. సాధారణంగా రిటైల్ రంగంలోని ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగాలు మారే రేటు) ఎక్కువగా ఉంటుంది. దాంతో రిలయన్స్ రిటైల్ నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 38,029 మంది రాజీనామా చేశారు. అందులోనూ జియోలో అత్యధికంగా ఉద్యోగం వీడారు. జియోలో 43% కాంట్రాక్ట్ ఉద్యోగులు(ఉద్యోగం రెగ్యులర్ కానివారు, ఒప్పంద ఉద్యోగులు, పార్ట్‌టైమ్ చేస్తున్నవారు, అప్రెంటిస్‌లు, ఇంటర్న్‌లు) ఉన్నారు. రిలయన్స్ రిటైల్‌లో పని చేస్తున్న మొత్తం శ్రామిక శక్తిలో సగానికి పైగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారేనని సంస్థ పేర్కొంది.
ఇదీ చదవండి: ఊహించిందే జరిగింది.. వడ్డీరేట్ల మార్పు ఎప్పుడంటే..
ఇదిలాఉండగా, రిలయన్స్ గ్రూప్ ఉద్యోగుల్లో 53.9% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారని వార్షిక నివేదికలో వెల్లడించారు. అందులో 21.4% మహిళలున్నారు. అలాగే, కొత్తగా నియమితులైన వారిలో 81.8% మంది 30 ఏళ్లలోపు వారు కాగా, 24.0% మంది మహిళలు. ఉద్యోగం మానేసిన వారిలో 74.9% మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే కావడం విశేషం. అందులో 22.7% మంది మహిళలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment