పట్నా: జనతా దళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన జేడీయూ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ కుమార్ పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. నితీష్ కుమార్ ఎన్నికకు ముందు లలన్ సింగ్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసి.. నితీష్ కుమార్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదించారు.
మరో వైపు లలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అతనిపై అసంతృప్తితో ఉన్న సీఎం నితీశ్ కుమార్.. ఆయన్ని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. ఇక.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను నితీశ్ కుమార్ చేపట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment