నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా! | Candidate Offers To Pay Rs 40000 To Founder For a Job Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇవ్వండి మ‌హాప్ర‌భో.. డ‌బ్బులిస్తా.. న‌చ్చ‌క‌పోతే..

Published Sat, May 4 2024 5:42 PM | Last Updated on Sat, May 4 2024 6:08 PM

Candidate Offers To Pay Rs 40000 To Founder For a Job Tweet Goes Viral

ఓ వ్యక్తి చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావడం అనేది ప్రస్తుత కాలంలో అసాధ్యమైపోతోంది. దీంతో కొందరు సొంతంగా బిజినెస్ చేస్తుంటే.. మరికొందరు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దీని కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

ఇటీవల వింగిఫై వ్యవస్థాపకుడు ఒక తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి వింగిఫైలో తనకు ఉద్యోగం కావాలని. ''ఉద్యోగం కోసం నేను 500 డాలర్లు (రూ. 41000 కంటే ఎక్కువ) చెల్లిస్తాను. వారం రోజుల్లో నా పనితనాన్ని నిరూపించుకుంటాను. ఆలా నిరూపించుకోని సమయంలో నన్ను ఉద్యోగం నుంచి తొలగించండి. ఆ డబ్బు కూడా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ టీమ్ సమయాన్ని వృధా చేయకూడదని చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.

ఈ పోస్టును వింగిఫై ఛైర్మన్ పరాస్ చోప్రా షేర్ చేసిన తరువాత నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగార్ధుల పరిస్థితి ఇది అని కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు జాబ్ తెచ్చుకోవడానికి ఇది సరైన మార్గం కాదని పేర్కొన్నారు. అయితే చోప్రా మాత్రం ఇది అందరి దృష్టిని ఆకర్శించింది అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement