నైట్‌షిఫ్ట్‌తో క్యాన్సర్ ముప్పు!
న్యూఢిల్లీ: అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులతో రాత్రిపూట కూడ పనిచేయించు కొంటున్నాయి. ఈ కంపెనీలు ప్రధానంగా అమెరికా,యూకే దేశాలతో తమ ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయనే విషయం తెలిసిందే..అయితే తాజాగా, వాషింగ్టన్ యూనివర్సీటీ పరిశోధనల్లో మరొక భయంకరమైన విషయాన్నివెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం, పగటిపూట పనిచేసే వ్యక్తులతో పోలీస్తే, రాత్రిళ్ళు పనిచేసే వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని తెలిపింది.
కాగా,ఈ రీసెర్చ్‌ను జర్నల్ ఆఫ్ పినీల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. వీరిలో శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయని కూడా తెలిపారు. అయితే..రాత్రిళ్ళు పనిచేసే వారిలో జీవ గడియారంలో మార్పులు వచ్చి..ఏదిసరిగ్గా గుర్తుండక పోవడం, ఆకలిలేకపోవడం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో గుండె సంబంధిత ప్రభావం కూడా ఎక్కువేఅని అంటున్నారు. కాగా, తాజా పరిశోధనలతో నైట్ షిప్టులు ప్రమాదకరమనే విషయం మరోసారి రుజువైంది.
చదవండి: మేనకోడలిని దారుణంగా చంపాడు!
Comments
Please login to add a commentAdd a comment