సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈఓకు నౌహీరా షేక్ బెదిరింపులు
బంజారాహిల్స్(హైదరాబాద్): యాప్ రూపకల్ప నలో భాగంగా ఓ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కోట్లాది రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్ట డమే కాకుండా అడగడానికి ఇంటికొచ్చిన సీఈఓను అంతుచూస్తానని బెదిరించిన ఘటనలో హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరాషేక్, ఆమె భర్త సమీర్‌ఖాన్ లపై బంజారాహిల్స్‌లో క్రిమినల్ కేసు నమో దెంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎమ్మెల్యే కాల నీలో నివసించే నౌహీరా షేక్ వ్యాపారాల పేరుతో డబ్బులు వసూలు చేసి వేలాది మందికి కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు. ఎవరెవరికి బకాయి ఉన్నారో, వారికి సంబంధించిన లెక్కలు తేల్చేందుకు ఒక యాప్‌ను రూపొందించాలని బెంగళూరుకు చెందిన వన్‌హెల్ప్ టెక్నాలజీ సీఈఓ మహ్మద్ అఖిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
2021–23లో వన్ హెల్ప్ టెక్నాలజీ ఈ యాప్ రూపకల్పనలో భాగంగా బకాయిదారులకు చెల్లించాల్సిన డబ్బు లతో వివరాలు రూపొందించింది. ఇందుకు గాను రూ.7.46 కోట్లు నౌహీరా షేక్ సదరు సంస్థ సీఈఓకు అఖిల్‌కు బాకీ పడింది. ఈ డబ్బులు తరచూ అడుగుతున్నా, ఆమె దాటవేస్తూ వచ్చింది. ఎక్కువ మాట్లాడితే కేసులు పెడ తానని బెదిరించసాగింది. ఈ నెల 11వ తేదీన అఖిల్ నౌహీరాషేక్ ఇంటి కొచ్చాడు.
తనకు బాకీ పడ్డ రూ.7.46 కోట్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఆగ్రహంతో ఊగిపోయిన నౌహీరా షేక్ తలకాయ కట్ చేస్తా బిడ్డా..ఇక్కడే హత్య చేసి పాతిపెడతా..హైదరాబాద్ దాటి ఎలా వెళతావో చూస్తా అంటూ బెదిరించడమే కాకుండా ఆమె భర్త సమీర్‌ఖాన్ దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బయటకు గెంటించాడు. మా సంగతి మీకు తెలియదు.. నాకున్న కేసుల్లో ఇంకోటి చేరుతుంది అంతే..అంటూ హెచ్చరించారు. ఈ బెదిరింపులన్నీ అఖిల్ వారికి తెలియకుండా రికార్డు చేసి బంజారాహిల్స్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నౌహీరాషేక్, ఆమె భర్తపై బీఎన్‌ఎస్ సెక్షన్ 351 (2)(3) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment