రంగారెడ్డి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని ఘట్టుపల్లి శివారులో చోటు చేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మడ్డిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన మర్రిపూడి మణికంఠ(26) కోరల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
వీకెండ్ కావడంతో శనివారం స్నేహితులతో కలసి కోరుపోలు చంద్రారెడ్డి స్టేడియంలో క్రికెట్ ఆడాడు. బౌలింగ్ చేసిన మణికంఠ ఛాతి, వీపులో నొప్పిగా ఉందని స్నేహితులకు చెప్పి కారులో పడుకున్నాడు. కాసేపటికి స్నేహితులు వెళ్లి చూడగా నోటి నుంచి నురగలు వచ్చాయి. ఎంత పిలిచినా పలకకపోవడంతో వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నర్సయ్య కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment