
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలను టీనేజర్ పరుగులు పెట్టిస్తున్నాడు. మైక్రోసాఫ్ట్‌తో పాటు ఎన్‌వైదా, యుబిసాఫ్ట్, శాంసంగ్ సంస్థల్ని హ్యాక్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ సంస్థలు సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని ఆశ్రయించడంతో ఈ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నిపుణులు సైతం హ్యాకింగ్ వెనుక ల్యాప్సస్$ (Lapsus$) అనే గ్రూప్ ఉన్నట్లు నిర్ధారించారు. హ్యాకింగ్ ఎందుకు చేశారనే అంశంపై స్పష్టత లేకున్నా..ఆ హ్యాకింగ్ గ్రూప్‌కు మాస్టర్ మైండ్ 16ఏళ్ల టీనేజరేనని తేలింది.
సైబర్ నిపుణుల అంతర్గత విచారణలో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ ప్రాంతంలో టీనేజర్ తన తల్లితో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. టీనేజరే అయినా దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేయడంతో దాదాపూ 15వేల మంది క్లయింట్ల డేటా బహిర్ఘతం అయ్యింది. అందుకే హ్యాకింగ్ కోసం ఏదైనా సైబర్ గ్యాంగ్ హస్తం ఉందా అన్న కోణంలో సదరు సైబర్ ఎక్స్ పర్ట్స్ సభ్యులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అంతా సీక్రెట్
దర్యాప్తులో నిందితుడు 'వైట్', 'బ్రీచ్‌బేస్' అనే మారు పేర్లతో హ్యాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హ్యాకింగ్ కోసం ఉపయోగిస్తున్న 7అకౌంట్‌లను సైబర్ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ అకౌంట్ బ్రెజిల్‌కు చెందిన మరో యువకుడికి చెందిందని, ఇంతపెద్ద కంపెనీలను ఎందుకు హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేస్తే కలిగే లాభాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..టీనేజర్‌కు హ్యాకింగ్‌లో నైపుణ్యంగా ఎక్కువగా ఉందన్నారు. ల్యాప్సస్$ గ్రూప్ పేరుతో చేస్తున్న హ్యాకింగ్ కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓక్తాకు చెందిన 366మంది క్లయింట్లు నష్టపోయారు. ఓక్తా షేర్లు 9శాతం పడిపోయాయి.ఆ కంపెనీ కార్యకాలపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇప్పుడు ఇదే అంశం మిగిలిన సంస్థలకు ఆందోళన కలిగిస్తుందన్నారు.
కంపెనీలను హ్యాక్ చేయడానికి, వారి డేటాను దొంగిలించి, దానిని విడుదల చేసేందుకు పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు సైబర్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు టీనేజర్ నివసించే ప్రాంతాన్ని గుర్తించినా, అతని జాడ తెలియరాలేదు. హ్యాకర్స్ టార్గెట్ ఏంటీ? అనే విషయాలతో పాటు టీనేజర్‌ను పట్టుకునేందుకు మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment