ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సాధించిన ఫలితాలు ఐటీ రంగానికి జోష్‌నిస్తున్నాయి. దీంతో మధ్యస్థాయి ఐటీ కంపెనీల షేర్లకు సైతం డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలోనూ క్యూ1(ఏప్రిల్-జూన్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బుధవారం విప్రో కౌంటర్ 15 శాతం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ ఆకర్షణీయ పనితీరు చూపడంతో పలు ఐటీ కౌంటర్లు నేటి ట్రేడింగ్‌లో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. జాబితాలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, మాస్టెక్, సొనాటా సాఫ్ట్‌వేర్ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం..
ఇన్ఫోసిస్ టెక్నాలజీస్
ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్ షేరు ప్రస్తుతం 9.2 శాతం జంప్‌చేసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 955ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7.9 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్‌ఎస్‌ఈలో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 1.18 కోట్ల షేర్లు కావడం గమనార్హం!
ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ షేరు 4.6 శాతం జంప్‌చేసి రూ. 2291 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2336ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి 1.7 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం!
ఎంఫసిస్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ఎంఫసిస్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 1035 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1099ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎన్‌ఎస్‌ఈలో మధ్యాహ్నానికల్లా 13.8 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.54 లక్షల షేర్లు మాత్రమే!
మాస్టెక్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం మాస్టెక్ లిమిటెడ్ షేరు 9.2 శాతం జంప్‌చేసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 955ను అధిగమించింది. బీఎస్‌ఈలో మధ్యాహ్నానికల్లా 42,000 షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లు మాత్రమే కావడం గమనార్హం!
సొనాటా సాఫ్ట్‌వేర్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం సొనాటా సాఫ్ట్‌వేర్ షేరు 4 శాతం లాభపడి రూ. 245 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో మధ్యాహ్నానికల్లా 13.4 లక్షల షేర్లు చేతులు మారాయి.ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.6 లక్షల షేర్లు మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment