IT shares rally
-
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు, ఐటీ షేర్ల ర్యాలీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సోమవారం ఆరంభంలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు తరువాత 250 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 168 పాయింట్ల నష్టంతో 60093వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 17895వద్ద ముగిసింది. ఐటీ మినహా బ్యాంకింగ్, మెటల్, ఆటోఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, హీరోమోటో భారీగా లాభపడగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల, హిందాల్కో నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 39 పాయింట్లు నష్టంతో 81.64 వద్ద ఉంది. -
ఐటీ, ఆటో షేర్ల హోరు: స్టాక్‌మార్కెట్ల జోరు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమైనాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సూచనలతో ఆరంభంలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 16,300 పైన ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు దూకుడుతో కొత్త ఎఫ్ అండ్ వో సిరీస్ శుభారంభమైంది. యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు లేకపోవడంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా మారాయి. ప్రస్తుతం 434 పాయింట్ల లాభంతో 54,886 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 131 పాయింట్లు ఎగిసి 16301 వద్ద నిఫ్టీ కొనసాగుతున్నాయి. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. 3 శాతం ఎగిసిన టెక్ మహీంద్రా టాప్ గెయినర్‌గా ఉంది. అలాగే ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్ టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
ఆరు రోజులు.. రూ.10.56 లక్షల కోట్ల సంపద
స్టాక్ సూచీలు ఆరోరోజూ దూసుకెళ్లడంతో ఇన్వెస్టర్ల సంపద ఆల్‌టైం హైని అందుకుంది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ.10.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. మార్కెట్ ముగిసే సరికి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.272.76 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ గురువారమూ కొనసాగింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ రికవరీ కలిసొచ్చింది. ఒక్క ఆటో మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపుల్లో సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 569 పాయింట్ల లాభంతో 61వేలపైన 61,306 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 18,339 వద్ద నిలిచింది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,116 పాయింట్లు, నిఫ్టీ 692 పాయింట్లు చొప్పు లాభాపడ్డాయి. వచ్చే వారం నుంచి బ్యాంకింగ్ రంగ ఆర్థిక ఫలితాలు వెల్లడి కానున్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 616 పాయింట్లు పెరిగి 61,353 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు ఎగసి 18,351 వద్ద జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేశాయి. అయితే లాభాల స్వీకరణ జరగడంతో ఆటో షేర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1682 కోట్లు షేర్లను కొనగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.1751 కోట్ల షేర్లను అమ్మారు. లాభాలకు కారణాలు... మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు... కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. మంగళవారం(సెప్టెంబర్ 12న) వెల్లడైన ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సానుకూల రీతిలో 11.9 శాతంగా నమోదయ్యాయి. అదే రోజున విడుదలైన సెప్టెంబర్ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి దిగివచ్చింది. ఆహార ధరలు అదుపులోకి రావడంతో సెప్టెంబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టస్థాయి 10.66%గా నమోదైంది. రూపాయి రెండోరోజూ రికవరీ... ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ రికవరీ కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఎఫ్ఓఎంసీ మినిట్స్ వెల్లడి ముందు డాలర్లో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా డాలర్ మారకంలో 11 పైసలు బలపడి 75.26 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు బాండ్ల ఈల్డ్స్ ర్యాలీ ఆగకపోవడంతో పాటు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టం నుంచి దిగిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. ఈ అంశం దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఆసియాలో ఒక్క చైనా మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం నుంచి అరశాతం ర్యాలీ చేశాయి. అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అండగా ఐటీ షేర్ల ర్యాలీ... దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. దీంతో సంబంధింత షేర్లలో ర్యాలీ కొనసాగింది. ఇన్ఫీ షేరు ఇంట్రాడేలో నాలుగు శాతం లాభపడి రూ.1784 స్థాయిని తాకింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో అరశాతం స్వల్ప లాభంతో రూ.1716 వద్ద స్థిరపడింది. విప్రో షేరు ఐదు శాతం లాభంతో రూ.708 వద్ద ముగిసింది. మైండ్ ట్రీ షేరు ఏడున్నర శాతం ఎగసి రూ.4,691 వద్ద నిలిచింది. నేడు మార్కెట్ సెలవు దసరా సందర్భంగా శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు సెలవు. బులియన్, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు కూడా పని చేయవు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో మార్కెట్ సోమవారం ప్రారంభమవుతుంది. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్ 1,247 పాయిం ట్లు, నిఫ్టీ 443 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ స్థాయి చేరేందుకు పట్టిన కాలం 56,000 18 ఆగస్ట్ 2021 57,000 31 ఆగస్ట్ 2021 (13 రోజులు) 58,000 3 సెప్టెంబర్ 2021 (3 రోజులు) 59,000 16 సెప్టెంబర్ 2021 (13 రోజులు) 60,000 24 సెప్టెంబర్ 2021 (8 రోజులు) 61,000 14 అక్టోబర్ 2021(20 రోజులు) చదవండి : పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్ -
యాక్సెంచర్ పుష్- ఐటీ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తాజాగా నవంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశావహ ఫలితాలు ప్రకటించింది. దీంతో దేశీయంగా లిస్టెడ్ దిగ్గజ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 2 శాతం ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సరికొత్త గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (కన్సాలిడేషన్ బాటలో- 47,000కు సెన్సెక్స్) యాక్సెంచర్ జోష్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తొలి త్రైమాసికంలో డాలర్ల రూపేణా 4 శాతం వృద్ధితో 11.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. ఇది అంచనాలకంటే అధికంకాగా.. నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 16.1 శాతానికి చేరాయి. ప్రయాణ వ్యయాలు తగ్గడం, పెరిగిన ఉత్పాదకత వంటి అంశాలు మార్జిన్లకు బలాన్నిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 25 శాతం వృద్ధితో 12.9 బిలియన్ డాలర్ల విలువైన తాజా డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. పూర్తి ఏడాదికి ఆదాయం 4-6 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజాగా అంచనా వేసింది. నిర్వహణ లాభం 7 శాతం పెరిగి 1.89 బిలియన్ డాలర్లను తాకింది. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు) షేర్ల జోరు యాక్సెంచర్ 4-6 శాతం వృద్ధితో ఆదాయ అంచనాలను ప్రకటించిన నేపథ్యంలో ఐటీ కౌంటర్లు జోరందుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ దాదాపు 3 శాతం ఎగసి రూ. 1,193 సమీపానికి చేరింది. ఇక టీసీఎస్ 2 శాతం బలపడి రూ. 2,894ను తాకింది. ఇవి ఇది సరికొత్త గరిష్టాలుకాగా.. హెచ్‌సీఎల్ టెక్ 2.5 శాతం లాభంతో రూ. 901 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో కోఫోర్జ్ 2.3 శాతం పుంజుకుని రూ. 2,569 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 1.6 శాతం బలపడి రూ. 3,359 వద్ద, ఎంఫసిస్ 1.6 శాతం పెరిగి రూ. 1,361 వద్ద కదులుతున్నాయి. విప్రొ 1.3 శాతం లాభంతో రూ. 362 వద్ద ట్రేడవుతోంది. -
మళ్లీ రికార్డుల పరుగు..!
ముంబై: స్టాక్ మార్కెట్ మళ్లీ రికార్డుల బాటపట్టింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 44 వేల పైన 44,077 వద్ద స్థిరపడింది. నిప్టీ 67 పాయింట్లను ఆర్జించి 12900 ఎగువున 12,926 వద్ద నిలిచింది. కోవిడ్–19 కట్టడికి ఫార్మా కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ట్రయల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయనే వార్తలు ఈక్విటీలకు ఉత్సాహాన్నిచ్చాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రాజెనికాల సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన వ్యాక్సిన్ సైతం తుది దశలో మెరుగైన ఫలితాలనిచ్చింది. అలాగే రిలయన్స్ – ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సీసీఐ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 3 శాతం లాభపడి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి రివకరీ కలిసొచ్చింది. మార్కెట్లో జరిగిన విస్తృతస్థాయి కొనుగోళ్ల భాగంగా చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.25% లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 389 పాయింట్లు ఎగసి 44,271 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 12,969 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు... ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితి 26 శాతానికి పెంచాలని ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) ప్రతిపాదనతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.50 శాతం నుంచి 1% నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1% పతనమైంది. 3 శాతం లాభపడ్డ రిలయన్స్ షేరు... ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీఐఐ) ఆమోదం తెలపడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3 శాతం లాభపడి రూ.1,951 వద్ద ముగిసింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్, గిడ్డంగుల వ్యాపారాలను కొనుగోలు చేయాలన్న రిలయన్స్ రిటైల్ సంస్థ ప్రతిపాదనకు శుక్రవారం సీఐఐ ఆమోదం తెలిపింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆర్ఐఎల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించండంతో షేరు ఇంట్రాడేలో 4 శాతం ఎగసి రూ.1,970 స్థాయిని అందుకుంది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.34,892 కోట్లు పెరిగి రూ.13.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లలోనూ కొనుగోళ్లే... రూ.24,173 కోట్ల ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సీఐఐ అనుమతులు లభించడంతో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ షేర్లు పరుగులు పెట్టాయి. రిటైల్ ఫ్యూచర్ 10% లాభపడి రూ.70 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ షేరు 10% ఎగిసి రూ.90.30 స్థాయిని తాకింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో 5% ర్యాలీతో రూ.10.45 స్థాయిని అందుకుంది. -
ఐటీ షేర్ల లాభాల హవా- భారీ ట్రేడింగ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సాధించిన ఫలితాలు ఐటీ రంగానికి జోష్‌నిస్తున్నాయి. దీంతో మధ్యస్థాయి ఐటీ కంపెనీల షేర్లకు సైతం డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలోనూ క్యూ1(ఏప్రిల్-జూన్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బుధవారం విప్రో కౌంటర్ 15 శాతం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఆకర్షణీయ పనితీరు చూపడంతో పలు ఐటీ కౌంటర్లు నేటి ట్రేడింగ్‌లో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. జాబితాలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, మాస్టెక్, సొనాటా సాఫ్ట్వేర్ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు ప్రస్తుతం 9.2 శాతం జంప్‌చేసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 955ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7.9 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈలో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 1.18 కోట్ల షేర్లు కావడం గమనార్హం! ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేరు 4.6 శాతం జంప్‌చేసి రూ. 2291 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2336ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 1.7 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం! ఎంఫసిస్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ఎంఫసిస్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 1035 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1099ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎన్ఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 13.8 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.54 లక్షల షేర్లు మాత్రమే! మాస్టెక్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం మాస్టెక్ లిమిటెడ్ షేరు 9.2 శాతం జంప్‌చేసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 955ను అధిగమించింది. బీఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 42,000 షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లు మాత్రమే కావడం గమనార్హం! సొనాటా సాఫ్ట్వేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం సొనాటా సాఫ్ట్వేర్ షేరు 4 శాతం లాభపడి రూ. 245 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252ను తాకింది. ఎన్ఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 13.4 లక్షల షేర్లు చేతులు మారాయి.ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.6 లక్షల షేర్లు మాత్రమే! -
యాక్సెంచర్ పుష్- ఐటీ షేర్లు గెలాప్
సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ మూడో త్రైమాసికం(మార్చి-మే)లో అంచనాలను మించిన ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ రంగ కౌంటర్లకు ఒక్కసారిగా ఉత్సాహమొచ్చింది. ఫలితంగా సాఫ్ట్వేర్ సేవల రంగంలోని దాదాపు అన్ని కౌంటర్లకూ డిమాండ్ పెరిగింది. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఐటీ ఇండెక్స్ ఏకంగా 4.5 శాతం జంప్‌చేసింది. దాదాపు అన్ని ఐటీ కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో బ్లూచిప్స్‌తోపాటు మిడ్ క్యాప్స్ సైతం భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరు తీరిలా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ 6.5 శాతం ఎగసి రూ. 747ను తాకగా.. టీసీఎస్ 5 శాతం జంప్‌చేసి రూ. 2113కు చరింది. విప్రో 4 శాతం లాభపడి రూ. 227 వద్ద, టెక్ మహీంద్రా 2.3 శాతం పుంజుకుని రూ. 567 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3 శాతం పురోగమించి రూ. 566కు చేరింది. రయ్రయ్ మిడ్ సైజ్ కంపెనీ కౌంటర్లలో నిట్ టెక్ 8 శాతం పెరిగి రూ. 1491కు చేరగా.. మైండ్‌ట్రీ 6 శాతం జంప్‌చేసి రూ. 972ను తాకింది. ఈ బాటలో ఎంఫసిస్ 4 శాతం బలపడి రూ. 906 వద్ద, ఎల్అండ్టీ టెక్నాలజీ 4.2 శాతం ఎగసి రూ. 1314 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం లాభంతో రూ. 1927 వద్ద కదులుతున్నాయి. క్యూ4 భళా ఐటీ దిగ్గజం యాక్సెంచర్ మేతో ముగిసిన తాజా క్వార్టర్లో 125 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 1.9 డాలర్ల షేరువారీ ఆర్జన(ఈపీఎస్)కాగా.. మొత్తం ఆదాయం 11 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో కంపెనీ 62.7 కోట్ల డాలర్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది. క్యూ4లో 10.6-11 బిలియన్ డాలర్ల ఆదాయం అంచనా(గైడెన్స్) వేస్తోంది. పూర్తి ఏడాదికి 7.7 ఈపీఎస్‌ను సాధించగలమని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. -
విప్రో,ఇన్ఫోసిస్, టీసీఎస్ ర్యాలీ...ఐటీ ఇండెక్స్ 2% అప్
బుధవారం ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లు జోరుగా ర్యాలీచేశాయి. నిఫ్టీఐటీ ఇండెక్స్ 2.7 శాతం లాభపడి రూ.13,952.90 వద్ద ముగిసింది. ఉదయం సెషన్లో నిఫ్టీఐ ఇండెక్స్ రూ.13,667 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.14,017 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన విప్రో 6.8 శాతం లాభపడి రూ.201.80 వద్ద, ఇన్ఫోసిస్ 3.7 శాతం లాభపడి రూ.706.20 వద్ద, టీసీఎస్ 3.3 శాతం లాభపడి రూ.2,008 వద్ద ముగిసాయి.హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్‌మహీంద్రా,ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ, హెక్సావేర్, జస్ట్‌డైల్‌లు 0.2 శాతం నుంచి 0.60 శాతం లాభపడి ముగిసాయి. ఇక ఈ ఇండెక్స్‌లోని మరో కంపెనీ టాటా ఎలక్సీ మాత్రం 1.4 శాతం నష్టపోయి రూ.749 వద్ద ముగిసింది. -
టెక్‌షేర్ల జోరు..ఎన్ఐఐటీ టెక్నాలజీస్ 7% అప్
శుక్రవారం ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి.మధ్యహ్నాం12:20 గంటల ప్రాంతంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1శాతం లాభపడి రూ.13,809.70 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్లో రూ.13,622.25 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీఐటీ ఇండెక్స్ రూ.13,854.90 వద్ద గరిష్టాన్ని, రూ.13,571.65 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఎన్ఐఐటీ టెక్నాలజీస్ 7.8 శాతం లాభపడి రూ.1,555.50 వద్ద ట్రేడ్ అవుతోంది. రూ.337.4 కోట్ల బైబ్యాక్ ఆఫర్ మే 29 నుంచి ప్రారంభమవుతుందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ వెల్లడించడంతో ఈ కంపెనీ షేర్లు లాభల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఇన్ఫోసిస్ 2.6 శాతం లాభంతో రూ.689.8 వద్ద, మైండ్‌ట్రీ 2శాతం లాభంతో రూ.902 వద్ద, జస్ట్‌డయల్ 1 శాతం లాభంతో రూ.353 వద్ద, టెక్ మహీంద్రా 0.79 శాతం లాభపడి రూ.524.15 వద్ద, టీసీఎస్ 0.75 శాతం లాభంతో రూ.2,006 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లోని కొన్ని షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో హెక్సావేర్ 1శాతం నష్టంతో రూ.236 వద్ద, టాటా ఎలక్సీ 0.45 శాతం నష్టంతో రూ.768 వద్ద, విప్రో 0.5శాతం నష్టంతో రూ.188 వద్ద, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 0.6శాతం నష్టంతో రూ.531 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. -
లాభాలతో ప్రారంభం: ఐటీ జూమ్
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. నార్త్‌కొరియా, అమెరికా సమ్మిట్ రద్దు కావడంతో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా ముగిసినప్పటికీ కీలక సూచీలు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ సెంచరీ లాభాలతో ఉత్సాహంగా సాగుతోంది. నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 10500కి ఎగువన ట్రేడ్ అవుతోంది.ఐటీ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస ఆల్‌టైం గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వేదాంత, ఎస్బీఐ ఐసీఐసీఐ, ఐటీసీ ఓఎన్జీసీ, టాటా మోటార్స్, సన్ ఫార్మ,చ నష్టపోతున్నాయి. గెయిల్, టెక మహీంద్ర, టాటా స్టీల్, యునైటెడ్ బ్రెవరేజుస్ లాభపడుతున్నాయి. -
ఐటీ జోరుతో వరుస నష్టాలకు బ్రేక్
ముంబై : లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, తన లాభాలను చివరి వరకు నిలుపుకున్నాయి. ఐటీ కంపెనీల జోరుతో వరుస నష్టాలకు బ్రేక్ ఇచ్చాయి. ఇక చివరికి సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంలో 33,845 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంలో 10,398 వద్ద ముగిశాయి. ఐటీ స్టాక్స్ నెలకొన్న బలమైన కొనుగోళ్లతో మార్కెట్లు ఈ లాభాలను ఆర్జించినట్టు విశ్లేషకులు చెప్పారు. పీఎన్బీలో చోటుచేసుకున్న భారీ కుంభకోణంతో గత మూడు సెషన్ల నుంచి మార్కెట్లు పడిపోతూనే ఉన్నాయి. కానీ నేడు మార్కెట్లు కొంత కోలుకున్నాయి. అయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ తాజాగా మరో మూడు నెలల కనిష్టంలో 64.94గా నమోదైంది. రూపాయి బలహీనపడుతుండటంతో, ఐటీ కంపెనీల షేర్లకు బూస్ట్ వచ్చిందని, ఓవర్సీస్ మార్కెట్లలో ఐటీ కంపెనీలకు రెవెన్యూలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ 50 స్టాక్స్‌లో టెక్ మహింద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ 3 శాతం పైగా లాభపడ్డాయి. వీటితో పాటు ఐటీసీ, ఓఎన్జీసీలు కూడా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అటు మెటల్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. సన్‌ఫార్మా దాదాపు 6 శాతం మేర పడిపోయి, నిఫ్టీ 50 స్టాక్స్‌లో టాప్ లూజర్‌గా ఉంది. -
స్టాక్ మార్కెట్లకు ఇన్ఫీ జోష్
* ఐటీ షేర్ల ర్యాలీ * 184 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ * వారంలో హెచ్‌యూఎల్ వృద్ధి 14 శాతం మార్కెట్ అప్డేట్ ముంబై: అంచనాలను మించిన ఇన్ఫోసిస్ ఫలితాలతో శుక్రవారం ఆ కంపెనీ షేరే కాకుండా స్టాక్ మార్కెట్లు కూడా పెరిగాయి. దీంతో వరుసగా రెండో రోజూ కూడా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆద్యంతం ఒడిదుడుకుల మయంగా సాగిన స్టాక్‌మార్కెట్లలో ఐటీ షేర్లు ర్యాలీ జరిపాయి. ఇన్ఫోసిస్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు బాగా ఉండటంతో ఆ కంపెనీ షేర్ 5 శాతం, దీంతోపాటు టీసీఎస్ షేర్ 2.8 శాతం చొప్పున పెరిగాయి. 184 పాయింట్ల సెన్సెక్స్ లాభంలో ఈ రెండు షేర్ల వాటానే 140 పాయింట్లుగా ఉండడం విశేషం. ఒక దశలో 233 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ ఇన్ఫోసిస్ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన, కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. ఇన్ఫోసిస్ ఫలితాలు బాగా ఉండటంతో మళ్లీ పుంజుకుంది. హిందూస్తాన్ యూనిలివర్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూ చిప్‌లు మద్దతుతో 184 పాయింట్లు లాభపడింది. 27,120- 27,508 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరకు 184 పాయింట్లు పెరిగి 27,458 పాయింట్ల వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 8,285 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇన్ఫోసిస్ ఫలితాల ఊపుతో టీసీఎస్, టెక్‌మహీంద్రా, విప్రో, సీఎంసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు 4 శాతం నుంచి 1 శాతం రేంజ్లో పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన మూడు నెలలకు చమురు సబ్సిడీ భారం నుంచి ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తల కారణంగా ఓఎన్జీసీ షేర్ 3 శాతం పెరిగింది. హిందూస్తాన్ యూనిలివర్ 5.8 శాతం లాభపడింది. ఆల్‌టైమ్ హై(868.4)ని తాకిన ఈ షేరు రూ.863.5 వద్ద ముగిసింది. వివిధ బ్రోకరేజ్ సంస్థల రికమండేషన్లతో ఈ షేర్ ఈ వారంలో 14 శాతం లాభపడింది. 30 షేర్ల సెన్సెక్స్‌లో 16 షేర్లు లాభపడగా, 14 షేర్లు నష్టాలపాలయ్యాయి. ఇన్ఫోసిస్ 5 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.2 శాతం, టీసీఎస్ 2.8 శాతం, ఓఎన్జీసీ 2.7 శాతం, సిప్లా 2.3 శాతం,రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం, టాటా మోటార్స్ 1.88 శాతం,విప్రో 1.5 శాతం, హిందాల్కో 1.5 వాతం, సన్ ఫార్మా 1.4 శాతం, టాటాస్టీల్ 1.2 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 శాతం చొప్పున పెరిగాయి. ఎన్టీపీసీ 3.3 శాతం, బజాజ్ ఆటో 1.3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.32 శాతం,భారతీ ఎయిర్టెల్ 1.3 శాతం, భెల్ 1.16 శాతం, హెచ్డీఎఫ్సీ 1 శాతం చొప్పున తగ్గాయి. 1,352 షేర్లు లాభపడగా, 1,541 షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈలో రూ.3,285 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఎన్ఎస్ఈలో టర్నోవర్ నగదు విభాగంలో రూ.19,139 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,57,439 కోట్లుగా ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.298 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.300 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న వార్త లు, ముడి చమురు ధరలు నిలకడగా ఉండడంతో ట్రేడింగ్ మొదట్లో ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత మిశ్రమంగా ముగిశాయి. జర్మనీ ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిగా ఉందని వెల్లడించే గణాంకాల కారణంగా యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.