
బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. వివిధ రంగాలలో కొనుగోళ్లకు దారితీయడంతో 1 శాతానికి పైగా లాభపడ్డాయి. 30 షేర్ల సెన్సెక్స్ 899.01 పాయింట్లు లేదా 1.19 శాతం పెరిగి 76,348.06 వద్ద స్థిరపడింది. ఈ సూచీ ఈరోజు 76,456.25-75,684.58 రేంజ్‌లో ట్రేడ్ అయింది.
ఇక నిఫ్టీ 50 కూడా 283.05 పాయింట్లు (1.24 శాతం) పెరిగి 23,190.65 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ 23,216.70 వద్ద రోజు గరిష్టాన్ని, 22,973.95 వద్ద కనిష్టాన్ని తాకింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.64 శాతం, 0.70 శాతం లాభపడ్డాయి.
ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, మీడియా, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి.
సెన్సెక్స్ లోని 30 షేర్లలో ఈ రోజు కేవలం మూడు మాత్రమే నష్టాలను చవిచూశాయి. భారతీ ఎయిర్ టెల్ 4 శాతం లాభంలో టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కూడా రాణించాయి. భారతీ ఎయిర్ టెల్ షేర్లు నిఫ్టీలోనూ మెరుపులు మెరిపించింది. నిఫ్టీ 50 షేర్లలో 4 మాత్రమే నష్టాలను చూశాయి.
Comments
Please login to add a commentAdd a comment