
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. నార్త్‌కొరియా, అమెరికా సమ్మిట్ రద్దు కావడంతో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా ముగిసినప్పటికీ కీలక సూచీలు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ సెంచరీ లాభాలతో ఉత్సాహంగా సాగుతోంది. నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 10500కి ఎగువన ట్రేడ్ అవుతోంది.ఐటీ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస ఆల్‌టైం గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వేదాంత, ఎస్‌బీఐ ఐసీఐసీఐ, ఐటీసీ ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, సన్ ఫార్మ,చ నష్టపోతున్నాయి. గెయిల్, టెక మహీంద్ర, టాటా స్టీల్, యునైటెడ్ బ్రెవరేజుస్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment