
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమైనాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సూచనలతో ఆరంభంలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 16,300 పైన ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు దూకుడుతో కొత్త ఎఫ్ అండ్ వో సిరీస్ శుభారంభమైంది.
యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు లేకపోవడంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా మారాయి. ప్రస్తుతం 434 పాయింట్ల లాభంతో 54,886 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 131 పాయింట్లు ఎగిసి 16301 వద్ద నిఫ్టీ కొనసాగుతున్నాయి. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. 3 శాతం ఎగిసిన టెక్ మహీంద్రా టాప్ గెయినర్‌గా ఉంది. అలాగే ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్ టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment