కరోనా లాక్‌డౌన్ సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించగా, మరికొన్ని సంస్థలు ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలామంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికీ తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది, ఇందులో భాగంగానే ఇటీవల లింక్డ్‌ఇన్ 668 మంది ఉద్యోగులను తొలగించింది.
లింక్డ్‌ఇన్ తొలగించిన ఉద్యోగులలో ఇంజినీరింగ్, ప్రొడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ టీమ్ ఎంప్లాయిస్ ఉన్నారు. కంపెనీ రెవెన్యూ ఇప్పటికీ పురోగతి చెందకపోవడమే ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణమని సంస్థ స్పష్టం చేసింది.
ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు వరకు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లలో భారీగా పెరిగిన ఉద్యోగాల కోతలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సగటున ప్రతి గంటకు 23 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతున్నట్లు లేఆఫ్.ఫీ (layoff.fyi) వెబ్‌సైట్ పేర్కొంది.
2022 - 23 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు 4,04,962 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో మాత్రం 1,061 టెక్ కంపెనీలు 164,769 మందిని, 2023 అక్టోబర్ 13 నాటికి 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి.
ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు!
2023 జనవరిలోనే 89,554 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2022లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు 2023 ప్రారంభం నాటికి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం లేఆప్స్ కొంత తక్కువయ్యాయి, కానీ ఇంకా పూర్తిగా ముగియలేదు.
Comments
Please login to add a commentAdd a comment