న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రాన్సమ్‌వేర్ ‘పెట్యా’ ప్రభావానికి అధికంగా లోనైంది భారతే అని భద్రతా సాఫ్ట్‌వేర్ సంస్థ సిమాంటెక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల అధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉందని పేర్కొంది.
ఉక్రెయిన్, రష్యాల్లో పెట్యా ప్రభావం అత్యధికంగా ఉందని వెల్లడించింది. పెట్యా దాడికి గురైన జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు(జేఎన్‌పీటీ)లో ఐటీ మౌలిక వసతుల భద్రతను పెంచడానికి, రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకున్నామని కేంద్రం తెలిపింది.