ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ
Published Wed, Oct 19 2016 5:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
మహిళపై కేసు నమోదు
గుంటూరు ఈస్ట్ : ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి రూ.10 లక్షలు కాజేసిన మహిళపై కేసు నమోదైంది. పాతగుంటూరు ఎస్‌హెచ్‌ఓ బాలమురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసే రవిరెడ్డి శివనాగపార్వతి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించింది. ఈ క్రమంలో ఆర్టీసీ కాలనీ 5వ లైనుకు చెందిన కొనకల్లు శారద 2015 జూన్‌లో మొదటి సారిగా రూ.2 లక్షలు, అనంతరం రూ.8 లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షలు చెల్లించింది. బ్యాంకులో ఉద్యోగం వస్తుందని నమ్మి డబ్బులు చెల్లించి వేచి చూసింది. ఎంతటికీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో శివనాగపార్వతిని నిలదీసింది. ఆమె డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement