నువ్వు లేకపోతే బతకలేనని, నమ్మించి శారీరకంగా లోబర్చుకుని.. | Girl Protest In City Center For Cheated By Lover Warangal | Sakshi
Sakshi News home page

నువ్వు లేకపోతే బతకలేనని, నమ్మించి శారీరకంగా లోబర్చుకుని..

Published Sat, Dec 25 2021 10:20 AM | Last Updated on Sat, Dec 25 2021 10:57 AM

Girl Protest In City Center For Cheated By Lover Warangal - Sakshi

దీక్ష చేస్తున్న మమత

సాక్షి,వరంగల్‌: చదువుకునే రోజుల్లో నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు, నీవులేకుండా నేను బతకలేనంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి మండల కేంద్రంలోని బొడ్రాయి సెంటర్‌ వద్ద టెంటు కింద నిరాహారదీక్ష చేసింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తనకు జరిగిన అన్నాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగలేదని, తనకు న్యాయం జరిగేవరకు పోరాటం విరమించేది లేదని వాపోయింది.

జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం తమ్మడపల్లికి చెందిన బాధితురాలు లోకిని మమత తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తాత్యాతండాకు చెందిన భూక్యా రవితో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని తెలిపింది. తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వంచనకు గురిచేశాడని వాపోయింది. ప్రస్తుతం అటవీశాఖ మంగపేట రేంజ్‌ పరిధిలోని కొత్తూరు బీటు పరిధిలో బీట్‌ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రవి పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ మోసం చేశాడని వాపోయింది. విషయమై కలెక్టర్, అటవీశాఖ వరంగల్, ములుగు డీఎఫ్‌ఓ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వాపోయింది. అయినప్పటికి తనకు ఏమాత్రం న్యాయం జరుగలేదని తెలిపింది. ప్రభుత్వం, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

చదవండి: వివాహేతర సంబంధం.. మాజీ నక్సలైట్‌ దారుణ హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement