సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వెబ్‌సైట్లు, ఇతర లింకులకు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తే చాలు మీరు లెక్కించలేనంత ఆదాయం మీ సొంతమవుతుందంటూ ఒక మోసగాడు సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చాడు. దీనికి విపరీతమైన స్పందన రావడంతో ఆ మోసగాడు చెలరేగిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
‘ఇంట్లో కూర్చుని సంపాదించండి’ అంటూ పలు ప్రకటనలు మనకు కనిపిస్తుంటాయి. అయితే వీటిలో చాలావరకూ మోసపూరితమైనవని తేలుతుంటాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ఇటువంటి ఉదంతం వెలుగుచూసింది. గురుగ్రామ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెక్టార్ 57 నివాసి సుబ్రత్ ఘోష్ తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గత మార్చినెలలో తనకు టెలిగ్రామ్ యాప్‌లో ఒక ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన కనిపించిందని సుబ్రత్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొన్ని వెబ్సైట్లకు, లింకులకు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా ప్రతీరోజూ పెద్దమెత్తంలో సొమ్ము పొందవచ్చని దానిలో పేర్కొన్నారని తెలిపాడు. అయితే ఈ ఉద్యోగం చేసేందుకు ముందుగా రూ.10 వేలు చెల్లించాలని దానిలో పేర్కొన్నారన్నాడు. ఈ మేరకు తాను వారు కోరిన మొత్తాన్ని చెల్లించడంతో వారు తనకు 30 లింకులు పంపించి, ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇవ్వాలని కోరారన్నాడు. దీనిని పూర్తి చేశాక తనకు రూ. 18 వేలు పంపారన్నాడు.
దీంతో తనకు వారిపై నమ్మకం పెరిగిందన్నాడు. అయితే అప్పుడు ఆ మోసగాడు..పెట్టుబడి మొత్తం పెంచితే వర్క్ కేటాయింపు కూడా పెరుగుతుందని తెలిపారన్నాడు. దీంతో తాను దఫదఫాలుగా రూ.25,29176 వారికి పెట్టుబడి రూపంలో చెల్లించానన్నాడు. అయితే ఆ మెసగాళ్లు తాను టాస్క్ పూర్తి చేసినా, దానిలో తప్పులు ఉన్నాయంటూ సొమ్ము ఇవ్వలేదని తెలిపాడు. పైగా మరో రూ.12 లక్షలు చెల్లించాలని కోరారన్నాడు. దీంతో తాను మోసపోయాననే సంగతి గ్రహించానని బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: క్షణాల్లో చెల్లింపులు చేసే క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుందంటే..
Comments
Please login to add a commentAdd a comment