పోలీసుల పేరు చెప్పి డబ్బు వసూలు..
Published Thu, Apr 7 2016 8:01 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
మొమిన్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : పోలీసుల పేరు చెప్పి ఓ మహిళ నుంచి డబ్బులు వసూలు చేస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొమిన్‌పేట మండలం ఎంకేపల్లి గ్రామానికి చెందిన యాదమ్మను నరసింహులు అనే వ్యక్తి.. 'నువ్వు బాణామతి, చేతబడి చేస్తున్నావు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. నాకు సీఐ, ఎస్‌ఐ తెలుసు. రూ.40 వేలు ఇవ్వకపోతే కేసు పెట్టిస్తా..త్వరలోనే జైలుకు కూడా పోతావ్' అని బెదిరించాడు. దీంతో బయపడ్డ యాదమ్మ తన ఒంటిపై ఉన్న బంగారాన్ని కుదవపెట్టి రూ.30 వేలు తీసుకువచ్చి నరసింహులుకు ఇచ్చింది.
రెండు రోజుల తర్వాత ఒంటిపై బంగారం లేకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులతో కలిసి మొమిన్‌పేట పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Advertisement