చీరాల (ప్రకాశం) : అమాయక ప్రజల నుంచి డిపాజిట్‌లు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థను ప్రభుత్వ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలోని సాయిభావన చిట్ ఫండ్స్ సంస్థ ప్రజల నుంచి కోటిన్నర వరకు డిపాజిట్‌లను స్వీకరించింది. తిరిగి డబ్బులు చెల్లించకుండా బోర్డు తిప్పేయడానికి యత్నించింది. దీంతో బాధితులు జిల్లా రిజిస్టార్‌కు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన అధికారులు కార్యాలయాన్ని సీజ్ చేసి వారం రోజుల్లోగా డబ్బులు తిరిగి ఇవ్వాలని సూచించారు.