పెళ్లి చేసుకుంటానని యువతిని లోబర్చుకొని మాటమార్చిన యువకుడి రిమాండ్
చాంద్రాయణగుట్ట: పెళ్లి చేసుకుంటానని యువతిని లోబర్చుకొని... చివరకు మాటమార్చిన యువకుడిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కె.మనోజ్ కుమార్ కథనం ప్రకారం... గౌలిపురా హనుమాన్‌నగర్‌కు చెందిన సుమన్(30) ఇంట్లో ఆరేళ్ల క్రితం ఓ యువతి (24) పని చేసింది. ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి సుమన్ అప్పటి నుంచి ఆమెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి ఇటీవల ఒత్తిడి తేవడంతో నిరాకరించడమే కాకుండా .. మళ్లీ ఆ మాట ఎత్తితే చంపేస్తానని సుమన్ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం నిందితుడు సమన్ శనివారం రిమాండ్‌కు తరలించారు.