
సాక్షి,తుగ్గలి(కర్నూలు): మండల కేంద్రానికి చెందిన అనిల్‌కుమార్ సెల్‌కు ఓ వ్యక్తి ఏఎస్‌ఐ నంటూ ఫోన్ చేసి రూ.10వేలు దోచేశాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఏఎస్‌ఐని మాట్లాడుతున్నానని, ఫోన్ పే ద్వారా డబ్బులు వేయాలని రెండు రోజులుగా ఓ వ్యక్తి (9640579106) అనిల్‌కుమార్‌కు ఫోన్ చేస్తున్నాడు. తమ వాళ్లు ఆస్పత్రిలో ఉన్నారని వెంటనే ఫోన్ పే ద్వారా రూ.10వేలు పంపించాలని కోరాడు. డబ్బు వెంటనే కానిస్టేబుల్ ద్వారా పంపుతానని నమ్మబలికాడు.
దీంతో అనిల్ అతను పంపిన (9550566601) నంబరుకు ఫోన్ పే ద్వారా రూ.10వేలు పంపాడు. ఎంతకూ డబ్బులు తీసుకు రాలేదు. కొద్దిసేపటికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించాడు. ఈ మేరకు శనివారం తుగ్గలి పోలీసులకు వివరించినట్లు బాధితుడు తెలిపారు. అయితే ఈ విషయమై ఇంకా కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.
చదవండి: విచక్షణ కోల్పోయి మిత్రుడిని హతమార్చి.. ఇంట్లోనే సగం కాల్చి..
Comments
Please login to add a commentAdd a comment