
సాక్షి,హైదరాబాద్: నగరంలోని చంపాపేట్ లో ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటన చేటుచేసుకుంది. పవన్ అనే వ్యక్తి కర్మాన్ ఘాట్‌కు చెందిన సమీప బంధువుని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పవన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 2017లో పెళ్లి పేరుతో బెంగళూరులో యువతి మెడలో పవన్ పసుపు కొమ్ము కట్టాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ పవన్ నాటకమాడాడు. దీంతో బాధితురాలు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు కేసు నమోదు చేసిన పోలీసులు పవన్‌ను అరెస్ట్ చేశారు.