
కుత్బుల్లాపూర్: ఫేస్‌బుక్ మెసెజ్‌తో ఓ వ్యకి నగదు ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోయాడు. పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలోని హరిహర ఎవెన్యూలో నివసించే కళ్యాణ చక్రవర్తి క్యూపీఎస్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 10న అతని ఫేస్‌బుక్ అకౌంట్‌కు అర్జంట్‌గా రూ. 18వేల పంపాలని అతని కజిన్ పేరుపై మెసెజ్ వచ్చింది. దీంతో చక్రవర్తి గుగూల్‌పే చేశాడు.
తరువాత కాసేపటికేరూ. 12వేలు పంపాల్సిందిగా మరో మెసెజ్ రావడంతో సదరు నగదును ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయినా నగదు పంపాల్సిందిగా మెసెజ్‌లు వస్తుండటంతో అనుమానం వచ్చి తన కజిన్‌కు కాల్ చేయగా ఫేక్ మెసేజ్‌గా తేలింది. దీంతో మోసపోయిన బాధితుడు బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment