
ఫేస్‌బుక్‌లో పరిచయం.. యువతి మోసం
మొఖం కనబడకుండా స్కార్ప్ కట్టుకుని ఉన్న ఆ యువతి కొద్దిసేపు కబుర్లు చెప్పింది. యువకుడి చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్ అడిగి తీసుకుని ఒక్క ఉదుటన తన స్కూటీపై ఉడాయించింది. తేరుకున్న యువకుడు తన బైక్‌పై ఆమెను పట్టుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. యువతికి సంబంధించిన వివరాలు, ముఖం చూడకపోవడంతో యువకుడు మోసపోయానని వెల్లడించాడు. ఫేస్ బుక్‌లోనూ ఆమె ఫొటో ఉంచలేదని తెలిపాడు. వాహనం నంబర్ కూడా నోటు చేసుకోలేకపోయానని చెప్పాడు.