
సాక్షి, బనశంకరి (బెంగళూరు): ఫేస్‌బుక్‌లో మొదలైన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇల్లు వదిలి వచ్చేశారు. ఇది సాధారణంగా జరుగుతున్న సంఘటనే కదా, వింతేముంది అనుకోకండి. అలా ప్రేమలో పడినవారిద్దరూ అమ్మాయిలే. వారి పెళ్లికి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఘటన బుధవారం బెంగళూరు కోరమంగల పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు...మహారాష్ట్ర నాసిక్ కు చెందిన దీపా, బెంగళూరు ఆడుగోడికి చెందిన గీత అనే ఇద్దరు అమ్మాయిలకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది.
కొన్ని నెలలనుంచి ఇద్దరూ బాగా చాటింగ్ చేస్తున్నారు. ఇద్దరి అభిరుచులూ కలిశాయి, ఇక ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన దీపా కొద్దిరోజుల కిందట నాసిక్ నుంచి వచ్చేసి బెంగళూరులో గీతా ఇంటికి చేరుకుంది. తామిద్దరం వివాహం చేసుకుంటున్నట్లు చెప్పడంతో గీతా తల్లిదండ్రులు తెల్లబోయారు. ఇదెక్కడి విడ్డూరం దేవుడా అని విలపిస్తూ ఈ లెస్బియన్ పెళ్లి వద్దంటే వద్దని తేల్చిచెప్పారు. అయితే దీపా– గీతా మహారాష్ట్రకు పారిపోయారు. గీతా కనబడక పోవడం పట్ల కుటుంబసభ్యులు బుధవారం కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment