సాక్షి, చిత్తూరు: కలికిరి బ్యాంకు కుంభకోణంలో కొత్త విషయాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో బ్యాంకు మెసెంజర్ అలీ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన భార్య ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. ఆమె బంగారు నగల కోసం తరచూ తనపై ఒత్తిడి తెచ్చేదన్నారు. వాటిని తట్టుకోలేకే బ్యాంకు నుంచి కోటి రూపాయలు స్వాహా చేసినట్లు చెప్పారు. కాజేసిన సొమ్ముతో రూ. 30 లక్షల విలువచేసే బంగారు నగలు, మరో 70 లక్షలు బంధువుల పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీఐ నాగార్జున్ రెడ్డి నేతృత్వంలో మరింత లోతైన విచారణ జరుగుతోంది.
కలికిరి బ్యాంకు కుంభకోణంలో ఆసక్తికర విషయాలు
Published Fri, Aug 27 2021 11:51 AM | Last Updated on Fri, Aug 27 2021 12:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment