హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రెడిట్ హిస్టరీ చూడకుండానే లోన్ యాప్స్ రుణం అందిస్తున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నిముషాల్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి. లోన్ యాప్స్ ద్వారా రుణం పొందితే అధిక వడ్డీ చెల్లించాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా కస్టమర్లు వీటినే ఎంచుకుంటున్నారని ఇన్ఫోటైన్‌మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇటీవలి కాలంలో లోన్ యాప్స్ మోసాలు, వేధింపులు మితిమీరాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 2 లక్షల పైచిలుకు మంది పాలుపంచుకున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళలు ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది 21–30 ఏళ్ల వయసువారే.
ఇవీ సర్వే ముఖ్యాంశాలు..
లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే విషయం తమకు తెలుసు అని సర్వేలో పాల్గొన్న వారిలో 1,40,387 (70 శాతం) మంది తెలిపారు. లోన్ ఇస్తామంటూ వచ్చే కాల్స్, సందేశాలను 86,796 (43 శాతం) మంది అందుకున్నారు. సర్వేలో పాల్గొన్నవారుగానీ వారి సన్నిహితులు, బంధువుల్లో లోన్ యాప్స్ ద్వారా రుణం పొందినవారు 1,02,106 (51 శాతం) ఉన్నారు. తాముగానీ, తమకు తెలిసినవారిలో లోన్ యాప్స్ బాధితులూ ఉన్నారని 1,34,607 మంది (67 శాతం) వెల్లడించారు. ఈ స్థాయిలో బాధితులు ఉన్నప్పటికీ సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదని 79 శాతం మంది చెప్పడం గమనార్హం.
వడ్డీ ఎక్కువైనా లోన్ యాప్స్ నుంచి రుణం
Published Wed, Aug 3 2022 6:39 AM | Last Updated on Wed, Aug 3 2022 10:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment