
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి, ప్రధానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు శుక్రవారం లేఖ రాశారు. తీవ్రమైన ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఇందు భారత్ పవర్ లిమిటెడ్,ఇందు భారత్ పవర్ ఇన్‌ఫ్రా, ఆర్కే ఎనర్జీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇందు భారత్ కంపెనీలు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టాయని, రూ.941.71 కోట్ల రూపాయాల ప్రజాధనం స్వాహా చేశారని’’ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు.
‘‘విద్యుత్ కంపెనీ పేరుతో లోన్లు తీసుకుని నిధులను పక్కదారి పట్టించారు. ఎస్‌బీఐ నుంచి రూ.63.46 కోట్లు తీసుకుని ఎగ్గొట్టారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను తీవ్రంగా మోసం చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదు. దీని వల్ల ప్రజలకు సంస్థలపై ఉన్న నమ్మకం పోయే ప్రమాదం ఉంది. తక్షణమే ఇందు భారత్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని’’ లేఖలో కోరారు. ఈ కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలి. మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలి. రూ.వేల కోట్ల ప్రజధనాన్ని కాపాడాలని లేఖలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment