
రతన్ లాల్ హంగ్లూ
న్యూఢిల్లీ: అలహాబాద్ వర్సిటీ వీసీ రతన్ లాల్ హంగ్లూ రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్చార్డీ) వెల్లడించింది. అనేక అవక తవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని రాష్ట్రపతి ఆదేశించారని పేర్కొంది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్చార్డీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి వర్సిటీ వీసీగా ఉన్న సమయంలోనూ హంగ్లూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు.