
సాక్షి, తిరుమల : కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ టీటీడీపై ప్రశంసలు కురింపించారు. టీటీడీ సౌకర్యాలపై సంతృప్తి చెందిన ఆయన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలతోపాటు వేదిక్ యూనివర్శిటీ ప్రత్యేకతల గురించి రాష్ట్రపతికి ఈవో సింఘాల్ వివరించారు. రోండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రపతి చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకుగానూ రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment