
మదనపల్లె : భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఏడాది కాలంగా తనకు న్యాయం జరగలేదని మనస్తాపంతో ఓ వివాహిత ఆదివారం పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా బేతమంగళానికి చెందిన సుధా(34) మదనపల్లె మండలం కొత్తిండ్లుకు చెందిన బాలప్రసాద్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాలాజీ(8) అనే కుమారుడు ఉన్నారు. అయితే భర్త, అత్త తనను వరకట్న వేధింపులకు గురి చేస్తూ చిత్ర హింసలు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ సుధా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు బాలప్రసాద్‌పై వరకట్నం, హత్యాయత్నం కేసులు నమోదు చేసి తాలూకా పోలీసులు రిమాండ్‌కు పంపారు. అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆదివారం సుధా మదనపల్లె తాలూకా పోలీసుస్టేషన్‌కు వచ్చింది. తన భర్త రెండో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని న్యాయం చేయాల్సిందిగా కోరింది. అయితే ఎస్‌ఐ, సీఐలు లేరని వారు వచ్చాక రావాలని స్టేషన్ సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె స్టేషన్ బయటకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తన భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకోవడంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఏడాదిగా తనకు న్యాయం జరగలేదని ఆరోపించింది. బాధితురాలిని వెంటనే పోలీసులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment