
నరేష్‌కుమార్‌రెడ్డి, మొహిద్దీన్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం జగన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి అఘా మొహిద్దీన్ వైఎస్సార్‌సీపీలో చేరారు.
బుధవారం మదనపల్లెలో హెలిప్యాడ్ వద్ద వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం జగన్ వద్దకు వెళ్లారు. వారికి ముఖ్యమంత్రి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరేష్‌కుమార్‌రెడ్డి.. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీ మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా పని చేశారు.