
ప్రియుడితో స్వీటీ
సాక్షి, మదనపల్లె: ఇంటర్ చదివే రోజుల్లో పరిచయమయ్యాడు.. అమ్మాయిగా మారితే పెళ్లి చేసుకుంటానన్నాడు.. అమ్మాయిగా మారాక ఆరేళ్ల పాటు నాతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ ట్రాన్స్‌జెండర్ పోలీసులను ఆశ్రయించింది. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన స్వీటీ అలియాస్ లోకేష్ మదనపల్లెలో ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో చదివేటప్పుడు ములకలచెరువు మండలం పత్తికోటకు చెందిన మహేష్‌తో పరిచయమేర్పడింది. ఇద్దరు ఒకరు విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు.
చదవండి: (పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే..)
ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని లోకేష్‌ను అమ్మాయిగా మారాలని మహేష్ కోరాడు. దీంతో లోకేష్ శస్త్రచికిత్స చేయించుకుని స్వీటీగా మారిపోయాడు. ఇద్దరూ ఆరేళ్లపాటు సహజీవనం చేశారు. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, వంశవృద్ధి కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మహేష్ హేళన చేస్తూ ఇటీవల స్వీటీతో తెగతెంపులకు సిద్ధపడ్డాడు. దీంతో తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు మహేష్‌పై కేసు నమోదుచేసి తనతో పెళ్లి జరిపించాల్సిందిగా రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి స్వీటీ ఫిర్యాదుచేసింది.
చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..)
ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో స్వీటీ మీడియాతో మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణానికి సంబంధించి ఆధారాలు తన సెల్‌ఫోన్‌లో ఉంటే వాటిని మహేష్ తొలగించాడంది. గతంలో ఓసారి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మహేష్‌పై ఫిర్యాదుచేయగా.. పోలీసుల ముందు పెళ్లి చేసుకుంటానని అంగీకరించి ఆపై మాట మార్చాడని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించే సరికి.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానని రాజీకి వచ్చాడంది. అయితే తనను కాకుండా మహేష్ వేరొకరిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పడంతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వాపోయింది. మహేష్ కోసం మగతనాన్ని త్యాగం చేసిన తనకు అతడితోనే పెళ్లి జరిపించి న్యాయం చేయాల్సిందిగా ప్రాధేయపడింది.
చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం')
Comments
Please login to add a commentAdd a comment