సాక్షి, విశాఖపట్నం/చిత్తూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్య కేసులో నిందితులను ఇద్దరిని ప్రత్యేక చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలకు తరలించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన పురుషోత్తం, పద్మజ దంపతులు ఉన్నత చదువులు చదివి అజ్ఞానాంధకారంతో రక్తం పంచుకుపుట్టిన ఆలేఖ్య, సాయి దివ్యలను దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే.. ఇంట్లోనే క్షుద్రపూజలు చేసిన ఫలితంగా దివ్య శక్తులే తమ కూతుళ్లను తిరిగి బతికిస్తాయని అత్యంత క్రూరంగా ఇద్దరు కూతుళ్లను నగ్నంగా పూజలు చేయించి డంబెల్స్ తో దారుణంగా తలపై బలంగా కొట్టి చంపేశారు. (చదవండి: ‘నేను శివుణ్ణి.. కాళికను’: పద్మజ కేకలు)
చుట్టుపక్కల స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ హత్య కేసులో నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ లను అరెస్ట్ చేశారు. వీళ్ళ మానసిక స్థితి పై మెరుగైన చికిత్స అందించేందుకు విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో వీరిని విశాఖపట్నం తీసుకు వచ్చారు. వీరిద్దరిని క్లోజ్డ్ వార్డులో వేరువేరుగా ఉంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.(చదవండి: అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా?..)
Comments
Please login to add a commentAdd a comment