Psychotherapy
-
USA: చేయని తప్పుకు 43 ఏళ్లు కారాగారంలోనే
వాషింగ్టన్: చేయని నేరానికి 43 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన అమాయకురాలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. అమెరికాలోని ఒహాయోకు చెందిన 63 ఏళ్ల సాండ్రా హెమ్మీ కథ ఇది. మిస్సోరీలో 1980లో ఓ లైబ్రరీ వర్కర్‌ను కత్తితో పొడిచి చంపిందని సాండ్రాను అరెస్ట్ చేశారు. లాయర్‌తో వాదించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మానసిక చికిత్సకు అధిక మోతాదులో తీసుకున్న ఔషధాల మత్తులో ఆమె చెప్పిన నేరాంగీకార వాంగ్మూలాన్నే పోలీసులు కోర్టుకు సమరి్పంచారు. దాంతో ఆమెకు జీవితఖైదు విధించారు. కానీ అసలు హంతకుడు మైఖేల్ హోల్మ్యాన్ అనే పోలీసు అధికారి. ఈ విషయాన్ని సాండ్రా లాయర్లు ఆధారసహితంగా తాజాగా కోర్టులో నిరూపించారు. దాంతో ఆమె శుక్రవారం విడుదలయ్యారు. కూతురు, మనవరాలిని హత్తుకుని బోరున విలపించారు. అమెరికా చరిత్రలో చేయని నేరానికి అత్యంత ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన మహిళగా సాండ్రా పేరు నిలిచిపోనుంది. -
విశాఖకు ‘మదనపల్లి’ జంట హత్యల నిందితులు
సాక్షి, విశాఖపట్నం/చిత్తూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్య కేసులో నిందితులను ఇద్దరిని ప్రత్యేక చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలకు తరలించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన పురుషోత్తం, పద్మజ దంపతులు ఉన్నత చదువులు చదివి అజ్ఞానాంధకారంతో రక్తం పంచుకుపుట్టిన ఆలేఖ్య, సాయి దివ్యలను దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే.. ఇంట్లోనే క్షుద్రపూజలు చేసిన ఫలితంగా దివ్య శక్తులే తమ కూతుళ్లను తిరిగి బతికిస్తాయని అత్యంత క్రూరంగా ఇద్దరు కూతుళ్లను నగ్నంగా పూజలు చేయించి డంబెల్స్ తో దారుణంగా తలపై బలంగా కొట్టి చంపేశారు. (చదవండి: ‘నేను శివుణ్ణి.. కాళికను’: పద్మజ కేకలు) చుట్టుపక్కల స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ హత్య కేసులో నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ లను అరెస్ట్ చేశారు. వీళ్ళ మానసిక స్థితి పై మెరుగైన చికిత్స అందించేందుకు విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో వీరిని విశాఖపట్నం తీసుకు వచ్చారు. వీరిద్దరిని క్లోజ్డ్ వార్డులో వేరువేరుగా ఉంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.(చదవండి: అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా?..) -
పాపకు ఘనాహారం ఎలా పెట్టాలి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఐదు నెలలు. మరో నెల రోజుల్లో ఘనాహారం మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. ఇలా ఘనాహారం మొదలుపెట్టేవారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియజేయండి. – ఆర్. ధరణి, హైదరాబాద్ పాలు తాగే పిల్లలను ఘనాహారానికి అలవాటు చేయడాన్ని వీనింగ్ అంటారు. ఈ వీనింగ్ ప్రక్రియలో చిన్నపిల్లలకు ఆర్నెల్లు దాటాక తల్లిపాలతో పాటు అన్నం, గోధుమల వంటి గింజధాన్యాలు (సిరియెల్స్), ఆపిల్, సపోటా వంటి పళ్లు, పప్పుధాన్యాలు (దాల్స్), కూరలలో క్యారట్, బాగా ఉడికించిన దుంపలు వంటివి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చాక మంచినీళ్లు తాగించడం అవసరం. ఈ వయసు పిల్లలకు పళ్లను జ్యూస్ రూపంలో ఇవ్వడం సరికాదు. పిల్లల ఆహారం తయారీకి కుదరని, అత్యవసర సమయాల్లో మాత్రమే – మార్కెట్లో దొరికే పిల్లల ఆహార పదార్థాలు (రెడీమేడ్ సిరియెల్ బేస్డ్ ఫుడ్స్)ను ఇవ్వవచ్చు. బాబు గోడకు ఉన్న సున్నం తింటున్నాడు... మా బాబు వయసు ఐదేళ్లు. చాలా సన్నగా ఉంటుంది. అన్నం అసలు తినదు. చిరుతిండి ఎక్కువగా తింటుంది. ఈమధ్య ఎక్కువగా గోడకు ఉన్న సున్నం తింటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఒంట్లో రక్తం తక్కువగా ఉందని అని కొన్ని మందులు ఇచ్చారు. వాడినా ప్రయోజనం లేదు. ఈ సమస్య తగ్గడం ఎలా? మా బాబు కొంచెం లావెక్కడానికి తగిన సలహా ఇవ్వగలరు. – మీనాక్షి, చిత్తూరు మనం ఆహారంగా పరిగణించని పదార్థాలను పదే పదే తినడాన్ని వైద్య పరిభాషలో ‘పైకా’ అంటారు. ఈ కండిషన్ ఉన్నవారు మీరు చెప్పినట్లుగా సున్నంతో పాటు ప్లాస్టర్, బొగ్గు, పెయింట్, మట్టి, బలపాలు, చాక్‌పీసుల వంటి పదార్థాలను తింటుంటారు. మన సంస్కృతిలో మనం తినని పదార్థాలను తినడాన్ని కూడా ఒక రుగ్మతగానే అనుకోవాలి. అయితే ఇది చాలా సాధారణ సమస్య. ఐదేళ్ల లోపు పిల్లల్లో ఇది చాలా తరచూ కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణాలను నిర్దిష్టంగా చెప్పలేం. బుద్ధిమాంద్యం, పిల్లలపై పడే మానసిక ఒత్తిడి, తల్లిదండ్రుల ఆదరణ సరిగా లేకపోవడం వంటి కొన్ని అంశాలను దీనికి కారణాలుగా చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో తగిన పోషకాలు తీసుకోకపోవడం, ఐరన్ వంటి ఖనిజాల లోపం కూడా పైకా సమస్యతో పాటు కనిపిస్తూ ఉంటుంది. ఈ రుగ్మత ఉన్న పిల్లల్లో జింక్, లెడ్ స్థాయుల్లో మార్పులు, ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయేమో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. అనర్థాలు : ∙పేగుల్లో ఆహారానికి అడ్డంకి కలగడం ∙ఐరన్ పోషకంలో లోపం ఎక్కువగా కనిపించడం ∙మన శరీరంలో అనేక రోగకారక క్రిములు పెరగడం...వంటి అనర్థాలు పైకా వల్ల కనిపిస్తాయి. ఇక మీ పాప విషయంలో ఇదీ కారణం అని నిర్దిష్టం చెప్పలేకపోయినప్పటికీ పైన పేర్కొన్న కారణాల్లో ఏదైనా ఉందేమోనని చూడాలి. మరికొన్ని ఇతర పరీక్షలు కూడా చేసి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని విశ్లేషించాలి. మీ పాపకు డీ–వార్మింగ్ మందులతో పాటు ఇతర పారసైటిక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే మందులు మరోసారి వాడటం అవసరం. దానితో పాటు ఐరన్, క్యాల్షియమ్, జింక్ వంటి పోషకాలు ఇవ్వడం మంచిది. అలాగే కొద్ది మందిలో కొద్దిపాటి మానసిక చికిత్స (అంటే... డిస్క్రిమినేషన్ ట్రైనింగ్, డిఫరెన్షియల్ పాజిటివ్ రీ ఇన్ఫోర్స్మెంట్ వంటి ప్రక్రియలతో) కూడా అవసరం. ఈ చిన్నపాటి పద్ధతులతో చిన్నపిల్లల్లో ఆహారం కాని పదార్థాలను తినే అలవాటును చాలావరకు మాన్పించవచ్చు. ఇక లావు, సన్నం అనేది పిల్లల విషయంలో చాలా సాధారణంగా వినే ఫిర్యాదే. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పిల్లలను చూశాకే నిర్ధారణ చేయాలి. మీ పాప తన వయసుకు తగినంత బరువు ఉన్నట్లయితే పరవాలేదు. ఒకవేళ అలా లేకపోతే ఇంట్లో ఇచ్చే సాధారణ పోషకాలతో పాటు, కొన్ని మెడికల్లీ అప్రూవ్డ్ పోషకాలను ఇవ్వాల్సి రావచ్చు. మీరు మరోసారి మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదించి, ఈ విషయాలను చర్చించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
‘పొగ’ను అరికట్టే వ్యాక్సిన్!
పరిపరి శోధన ఒక్క వ్యాక్సిన్... ఒకే ఒక్క వ్యాక్సిన్... ‘పొగ’ను పూర్తిగా అరికట్టేస్తుందట! దమ్ముకొట్టకుండా ఉండలేని పొగరాయుళ్లు వ్యాక్సిన్ దెబ్బకు సిగరెట్ల జోలికి పొమ్మన్నా పోరట! తెలిసీ తెలియని వయసులో పొగతాగే అలవాటుకు బానిసై, ఆ తర్వాత దానివల్ల తలెత్తే అనర్థాలను గ్రహించినా మానుకోలేని పొగరాయుళ్లు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారు. మానసిక చికిత్సలు, మందులు కూడా వారి అలవాటును మాన్పించలేకపోతున్నాయి. అయితే, అలాంటి వారి చేత పొగతాగే అలవాటును తేలికగా మాన్పించేయగల వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ మెదడుపై నికోటిన్ ప్రభావాన్ని నిర్వీర్యం చేసేస్తుందని, దీంతో పొగరాయుళ్లు తమ అలవాటును ఎలాంటి ఇబ్బంది లేకుండా మానేస్తారని వారు చెబుతున్నారు. -
మానసిక వ్యాధులను నయం చేసే సైకియాట్రిస్టు
పద్మ వయసు 55. బయటకు వెళ్లడానికి భయపడుతుంది. వీధి కుక్కలు, పక్షులు, ఆవులను చూసి బెదిరిపోతుంది. కుక్కలు ఆమెను కరిచినట్లుగా, పక్షులు ఆమె మీద రెట్ట వేసినట్లు ఊహించుకుంటుంది. ఆమె తమ్ముడు సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లేవరకు ఆమె 12 ఏళ్లుగా ఇళ్లు దాటడం లేదు. హరీశ్ వయసు 45. అతను లిఫ్టు ఎక్కడానికి భయపడుతుంటాడు. 13వ అంతస్థులో ఉన్న తన కార్యాలయానికి మెట్ల మీదుగా రోజూ నడిచే వెళతాడు కానీ లిఫ్టు వాడడు. దీంతో హరీశ్ భార్య.. అతడ్ని సైకియాట్రిస్టు వద్దకు తీసుకెళ్లింది. వీరిద్దరికి సైకియాట్రిస్టు కౌన్సెలింగ్ ఇవ్వడంతో క్రమంగా ఇద్దరిలో మార్పు వచ్చింది. పద్మ ఇప్పుడు జూపార్కులకు కూడా వెళుతుంది. హరీశ్ కూడా లిఫ్టు వాడుతున్నాడు. ఇది సైకియాట్రిస్టు ప్రభావవంతమైన కౌన్సెలింగ్‌తోనే సాధ్యపడింది. సైకోథెరపీలో భాగమైన బిహేవియర్ థెరపీతో వారిద్దరూ తమ సమస్యలను అధిగమించారు. ఇలా వివిధ సమస్యలతో బాధపడేవారికి వైద్యం అందించేవారే.. సైకియాట్రిస్టులు. వివిధ రకాల వ్యక్తుల్లో వచ్చే మానసిక వ్యాధులను సైకియాట్రిస్టులు పోగొట్టాలి. ఈ నేపథ్యంలో సైకియాట్రిస్టులకు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వీరికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. పనివేళలు: సాధారణంగా సైకియాట్రిస్టుల పనివేళలు ఈ విధంగా ఉంటాయి. ఉదయం 9: ఆస్పత్రికి చేరుకోవాలి. 10 గంటలకు రోగులను పరీక్షించాలి. మధ్యాహ్నం ఆస్పత్రి సంబంధిత పని ఉంటుంది. ఒంటి గంటకు భోజనం. రెండు గంటలకు స్పెషాలిటీ క్లినిక్స్‌ను సందర్శించాలి. 4.30 గంటలకు సంబంధిత పేషెంట్ల సమస్యలపై చర్చలు, సమావేశాలు ఉంటాయి. 7 గంటలకు విధులు ముగుస్తాయి. అయితే సొంతంగా క్లినిక్‌ను ఏర్పాటు చేసుకునేవారు ఏ సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకేసారి రెండు, మూడింటిలో పనిచేసేవారి విధుల్ని బట్టి సమయపాలన ఆధారపడి ఉంటుంది. కెరీర్: వివిధప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రత్యేకంగా సైకియాట్రిస్టులను నియమించు కుంటున్నాయి. వివిధ స్వచ్చంధ సంస్థల్లో కూడా సైకియాట్రిస్టులకు అవకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఉద్యోగాలెన్నో ఉన్నాయి. సొంతంగా క్లినిక్‌ను నిర్వహించుకోవచ్చు. వేతనాలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు అందుకోవచ్చు. కొన్నేళ్ల అనుభవంతో నెలకు రూ. 80 వేల నుంచి రూ.90 వేల వరకు వేతనాలు లభిస్తాయి. పనితీరు, అనుభవంతో నెలకు రూ. లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు సంపాదించే వారున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా మంచి జీతాలు పొందొచ్చు. మంచి ప్రాక్టీస్‌తో సీనియర్ డాక్టర్ స్థాయికి చేరుకున్నవారు నెలకు రూ. 2.5 ల క్షల వరకు ఆర్జిస్తున్నారు. కావాల్సిన నైపుణ్యాలు: ఠి పేషెంట్ చెప్పేది చక్కగా వినాలి. ఠి ఎక్కువ ఓర్పు కావాలి. ఠి రోగి సమస్యను అవగాహన చేసుకుని విశ్లేషించగల సామర్థ్యం ఉండాలి. ఠి పేషెంట్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధాసక్తులు కనబర్చాలి. ఠి కొన్ని గంటలపాటు వారితో ఓపికగా మాట్లాడాలి. అర్హతలు: సైకియాట్రీ కోర్సులు చదవాలనుకునేవారు ముందుగా ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత మెడికల్ ఎంట్రెన్స్ టెస్టులు రాసి ఎంబీబీఎస్‌లో చేరొచ్చు. తదుపరి సైకియాట్రీలో పీజీ లేదా డిప్లొమా చేయొచ్చు. రెండేళ్ల డిప్లొమా కోర్సు (డీపీఎం)లోనూ, మూడేళ్ల డీఎన్బీ/ఎండీలోనూ సైకియాట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చైల్డ్ సైకియాట్రీ, జెరియాట్రిక్ సైకియాట్రీ, ఫోరెన్సిక్ సైకియాట్రీ వంటి స్పెషలైజేషన్లను విదేశాల్లో అభ్యసించవచ్చు.