హత్యకు గురైన మధు
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): మదనపల్లె పట్టణ శివారుప్రాంతం చంద్రాకాలనీ లక్ష్మీనగర్ సమీపంలో బుధవారం జరిగిన ఆటో డ్రైవర్ మధు హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. సంఘటన స్థలంలో లభించిన కీలక ఆధారాలతో మధు కళ్లలో కారంపొడి చల్లి మారణాయుధాలతో నరికి చంపినట్లు దర్యాప్తు బృందాలు గురువారం గుర్తించినట్లు సమాచారం. ఈ హత్యకేసులో కిరాయి హంతకుల పాత్ర ఉందన్న దిశగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు లోతుగా ప్రారంభించారు. గతంలో హతునితో గొడవ ఉన్న వ్యక్తులను కూడా అనుమానించి ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ హత్య కే సును చేధించేందుకు నలుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలను రెండు బృందాలుగా డీఎస్పీ రవిమనోహరాచారి నియమించారు. ఈబృందాలు సంఘటన స్థలంలో లభించిన కీలక ఆధారాలతోపాటు మార ణాయుధాలు, నిందితుల పాదరక్షలు, కారంపొడి, మరికొన్ని సాక్ష్యాధారాలను సేకరించినట్లు సమాచారం. మదనపల్లె, కురబలకోటకు చెందిన పాతనేరస్తులు, కిరాయి హంతకుల పాత్ర ఉందని, దర్యాప్తు బృందాలు తేల్చడంతో ఆదిశగా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు
విషాదం: భార్య మృతిని తట్టుకోలేక..
Comments
Please login to add a commentAdd a comment