నిందితుల అరెస్ట్ చూపుతున్న సీఐ శ్రీనివాసులురెడ్డి
యాదమరి(తిరుపతి): వ్యక్తిగత విషయాలపై హేళన చేయడంతోనే మురళీకళ్యాణ్(22)ను నగేష్ అంతమొందించినట్లు చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన యాదమరి పోలీసుస్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. దళవాయిపల్లెకు చెందిన చిన్నబ్బ కుమారుడు నగేష్(32), అదే గ్రామానికి చెందిన చంద్రబాబు కుమారుడు మురళీకళ్యాణ్(22), కృష్ణమందడి కుమారుడు జయరాం ముగ్గురూ స్నేహితులు. చిత్తూరులో భవన నిర్మాణ పనులకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే ముందు మద్యం సేవించేవారు.
చదవండి: వివాహిత అదృశ్యం.. భర్త ఇంట్లోలేని సమయంలో..
మద్యం మత్తులో నగేష్‌కు మగతనం లేదని మరళీకళ్యాణ్ తరచూ హేళన చేసేవాడు. ఇది కాస్త శ్రుతిమించడంతో నగేష్ కక్ష పెంచుకున్నాడు. ఈనెల 3వ తేదీ ఆదివారం రాత్రి గ్రామంలోని గంగమ్మ ఆలయం వెనుక ఉన్న మామిడి తోటలో మురళీకళ్యాణ్‌కు మద్యం తాపించి చాక్‌తో గోంతుకోసి హత్యచేసి అక్కడే పూడ్చిపెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు అన్న పవనకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో తామే హత్య చేశామని ఒప్పుకోవడంతో నగేష్, జయరాంపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment