మదనపల్లె: తెల్లారితే పెళ్లి.. వరుడికి షాక్‌ | Madanapalle: Bride Disappears Groom Complaint To Police | Sakshi
Sakshi News home page

Madanapalle: మదనపల్లె: తెల్లారితే పెళ్లి.. వరుడికి షాక్‌

Published Wed, Aug 25 2021 4:30 PM | Last Updated on Wed, Aug 25 2021 6:07 PM

Madanapalle: Bride Disappears Groom Complaint To Police - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు: తెల్లవారితే పెళ్లి పీటలెక్కాల్సిన వధువు అర్ధరాత్రి అదృశ్యమైంది. దీంతో పెళ్లికుమారుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..  అనంతపురం జిల్లా నంబర్ పూలుకుంట మండలం కమ్మలవారి బురుజుకు చెందిన రామాంజనేయులు(23)కు, తంబళ్లపల్లి మండలం బురుజుపల్లికి చెందిన కుమారి (19) కి ఇటీవల పెద్దలు వివాహం కుదిర్చారు. బుధవారం పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. 

ఈ క్రమంలో మంగళవారం రాత్రి వధూవరులు, బంధువులు మదనపల్లెలోని కళ్యాణం చేరుకున్నారు. అయితే, అర్ధరాత్రి పెళ్లి కూతురు అదృశ్యమైనట్లు గుర్తించిన వరుడు షాక్‌కు గురయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి మదనపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

చదవండి: అమరరాజా ఆటకట్టు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement