
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మానవత్వాన్ని ప్రదర్శించి నెటిజన్లతో పాటు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. సోమవారం కోయంబత్తూరు-వెలచెరి రూట్లో ఓ కార్యక్రమం కోసం సీఎం స్టాలిన్ వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి ఓ అంబులెన్స్ సైరన్ వినిపించింది. అది గమనించిన స్టాలిన్ తన కాన్వాయ్ ఆపి నెమ్మదిగా వెళ్లమని ఆదేశించి ఎడమ వైపు కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.
మార్గమధ్యంలో కాన్వాయ్‌ను నిలిపివేసి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం స్టాలిన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనేక మంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. ఇటీవల సీఎం స్టాలిన్ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. సీఎంగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు సంక్షేమ పథకాలతో పాటు ప్రజాహితమైన నిర్ణయాల తీసుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు. సీఎం కాన్వాయ్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాహనాల సంఖ్యను తగ్గించారు. ఆయన నిర్ణయాలకు ప్రతిపక్షాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు.
#WATCH | Tamil Nadu Chief Minister MK Stalin's convoy gives way to ambulance while enroute to Koyambedu from Velachery today. pic.twitter.com/IK03SkhyoK
— ANI (@ANI) November 1, 2021
చదవండి: అనుకుంది.. సాధించింది
Comments
Please login to add a commentAdd a comment