
వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఒక ప్రైవేటు అంబులెన్స్‌లో గ్యాస్ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.
ఈ క్రమంలో స్థానికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment