కొలంబో: శ్రీలంక ఆర్థిక, రాజీకీయ సంక్షోభంతో అట్టుడుకుతున్న సంగతి తెలసిందే. మరోవైపు నిరసకారుల్లో ఆగ్రహోజ్వల కట్టల తెంచుకుని వీధుల్లోకి వచ్చి హింసాత్మక నిరసనలు చేపట్టేలా చేసింది. ఈ నేపథ్యంలోనే లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని వీడిపోవాల్సి వచ్చింది కూడా. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకి దిగజారిపోతుందనే చెప్పాలి. మొన్నటి వరకు ఇంధన సంక్షోభం కారణంగా విక్రమసింఘే అధ్యక్షతన కొత్త ప్రభుత్వం అనవసరమైన ప్రయాణాలను మానుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మళ్లీ ఇప్పుడు తాజాగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అత్సవసర అంబులెన్స్ సేవలను కూడా నిలిపేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పలు ప్రాంతల్లో అత్యవతసర అంబులెన్స్ సేవలను నిలిసేస్తున్నట్లుగా వెల్లడించింది. అంతేగాదు ఇంధన సంక్షోభం కారణంగా అంబులెన్స్ సేవలను నిలిపేస్తున్నామని, అందువల్ల ప్రజలను అంబులెన్స్ సేవల కోసం 1990కి కాల్ చేయొద్దు అని కూడా చెప్పింది.
ఐతే మరోవైపు ప్రస్తుతం 3,700 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో కూడిన ఓడ ఆదివారం శ్రీలంకకు చేరుకుందని, అలాగే 3,740 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో కూడిన మరో ఓడ కూడా ఈరోజు లంకకు చేరుకుంటుందని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ పేర్కొంది. అంతేగాదు మంగళవారం నుంచి గ్యాస్ పంపిణీ సక్రమంగా క్రమపద్ధతిలో ఉంటుందని, ఈ నెలాఖరు కల్లా దేశీయ ఎల్‌పి గ్యాస్ డిమాండ్‌కు సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోతుందని లిట్రో గ్యాస్ కంపెనీ చైర్మన్ ముదిత పీరిస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీలంక 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎదుర్కొన్న అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంగా దీన్ని పేర్కొనవచ్చు.
(చదవండి: శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో సుమారు రూ. 39 లక్షల నగదు..)
Comments
Please login to add a commentAdd a comment