కొలంబో: చమురు సంక్షోభంతో శ్రీలంక సతమతమవుతోంది. దాంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని పేర్కొంది. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలనిఆదేశించింది. చమురు నిల్వలు అడుగంటుతుండటంతో విదేశీ మారక ద్రవ్యం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక ప్రజలు మళ్లీ నిరసనలకు దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment