మధుర: దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్ సేవలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అనారో గ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి ఆదివారం చెప్పారు. ఇలాంటి పథకం దేశంలోనే ఇది తొలిసారి అని తెలిపారు. 515 అంబులెన్స్‌లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్ ‘112’కు ఫోన్ చేసి, అంబులెన్స్ సేవలు పొందవచ్చని సూచించారు. ప్రతి అంబులెన్స్‌లో ఒక వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులు ఉంటారు. ఫోన్ చేస్తే దాదాపు 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంటుందని చౌదరి వివరించారు. గోవులకు అంబులెన్స్ సేవల పథకాన్ని డిసెంబర్‌లో ప్రారంభిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment