
ఒంగోలు: అలవలపాడులో ముఖాముఖి అనంతరం లోకేష్ పాదయాత్ర జరుగుతుండగా అలవలపాడు, హాజీస్‌పురం రోడ్డు మధ్యలో అంబులెన్స్ రోగులతో వస్తుండగా దానికి దారి ఇవ్వలేదు. పాదయాత్రలో లోకేష్‌తో నాయకులు ఉగ్ర నరసింహారెడ్డి, గొట్టిపాటి రవి, ముత్తుముల అశోక్‌రెడ్డి తదితర నాయకులు ఉన్నా కూడా అంబులెన్స్‌కు దారిద్దామని కానీ..రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలనే ప్రయత్నం చేయకపోవడం టీడీపీ కార్యకర్తలను కూడా ఒకింత విస్మయానికి గురిచేసింది.
యాత్రలో మద్యం ఏరులై పారింది. అలవలపాడు, రామాపురం, బండ్లపురం, హజీస్‌పురం వద్దకు రాగా 2001 కి.మీ పాదయాత్ర జరిగినందుకు గుర్తుగా శిలాఫలకం వేశారు. ఇదిలా ఉండగా తక్కువ మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఎక్కువ మందిని తీసుకు రావడంతో వాగ్వాదాలు జరగడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment