ఐపీఎల్‌కు ఉప్పల్ రెడీ! | IPL match starts to day in uppal stadium | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు ఉప్పల్ రెడీ!

Published Mon, May 12 2014 2:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఐపీఎల్‌కు ఉప్పల్ రెడీ! - Sakshi

ఐపీఎల్‌కు ఉప్పల్ రెడీ!

అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం సిద్ధమైంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
 ఆదివారం రైజర్స్ విశ్రాంతి తీసుకోగా, ముంబై ఆటగాళ్లు స్టేడియంలో సాధన చేశారు. జాన్‌రైట్, కుంబ్లే, జాంటీ రోడ్స్ పర్యవేక్షణలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయగా...రోహిత్ శర్మ, పొలార్డ్, రాయుడు లాంటి స్టార్ క్రికెటర్లు సాధనకు దూరంగా ఉన్నారు. మైక్ హస్సీ, సిమన్స్, ఓజాలతో పాటు పలువురు యువ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మాస్టర్ బ్యాట్స్‌మన్, ముంబై మెంటర్ సచిన్ టెండూల్కర్ మాత్రం మైదానానికి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement